»   » హీరో విశాల్ గెలుపు: తండ్రిలాగా అడుక్కునే స్థితి రాకుండా చర్యలు!

హీరో విశాల్ గెలుపు: తండ్రిలాగా అడుక్కునే స్థితి రాకుండా చర్యలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ యంగ్ హీరో విశాల్ మరోసారి విజయ దుందుభి మ్రోగించాడు. ఇప్పటికే నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా గెలిచి సంచలనం సృష్టించిన విశాల్.... తాజాగా తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విజయం సాధించారు.

రెండు సంవత్సరాల పాటు విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. విశాల్ జట్టు సభ్యులైన ప్రకాష్‌రాజ్‌(ప్రధాన కార్యదర్శి), గౌతమ్‌ వాసుదేవ మీనన్ (ఉపాధ్యక్షులు), ఎస్‌ఆర్‌ ప్రభు (కోశాధికారి) కూడా గెలిచారు.

భారీ మెజారిటీ

భారీ మెజారిటీ

తమిళ నిర్మాతల మండలిలో మొత్తం 1,212 మంది సభ్యులుండగా, 1059 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవికి పోటీచేసిన వారిలో విశాల్‌ కు 478, రాధాకృష్ణన్ కు 355, కేఆర్‌ కు 224 ఓట్లు వచ్చాయి.

నిర్మాతల కష్టాలను తీరుస్తా

నిర్మాతల కష్టాలను తీరుస్తా

తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతిపిన విశాల్ నిర్మాతల కష్టాలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నిర్మాతలు మార్పును కోరుకున్నారని, అందుకే తమను గెలిపించారన్నారు. తమిళ సినిమాకు మరోసారి స్వర్ణయుగం తీసుకు రావడమే లక్ష్యంగా తన టీం పని చేస్తుందని విశాల్ తెలిపారు.

తన తండ్రి లాంటి పరిస్థితి ఎవరికీ రానివ్వను

తన తండ్రి లాంటి పరిస్థితి ఎవరికీ రానివ్వను

ఎన్నికల ముందు విశాల్ మాట్లాడుతూ...తాను పోటీ చేయడానికి కారణం చిన్న నిర్మాతలు ఇబ్బంది పడకూడదనే, తన తండ్రి జీకే రెడ్డిలా ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడకూడకూడదు, చిన్న సినిమాల నిర్మాతగా ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు, ఓ చిత్రాన్ని విడుదల చేయాలంటే నిర్మాతల సంఘం వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేదని విశాల్ చెప్పుకొచ్చారు.

నడిగర్ సంఘంలో సక్సెస్

నడిగర్ సంఘంలో సక్సెస్

తమిళ నడిగర్ సంఘం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నటుడు విశాల్ నిలబెట్టుకొన్నారు. నటుల సంఘం భవన నిర్మాణాన్ని చెన్నైలో ఇటీవలే ప్రారంభించారు. భవన శంకుస్థాపన కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్, అజిత్, సీనియర్ నటుడు విజయ్ కుమార్, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగానూ విశాల్ తన హామీలు నెరవేస్తారని అంతా నమ్మకంగా ఉన్నారు.

English summary
Actor and producer Vishal was elected president of the Tamil Film Producers Council on Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu