»   »  గుండు తో యంగ్ హీరో

గుండు తో యంగ్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu
vishal
తెరపై గుండుతో కనిపించి కలెక్షన్లు కొల్లగొట్టటం తమిళ హీరోలకు కొత్తేం కాదు. చాలా కాలం క్రిందట 'మండే సూర్యుడు' కోసం శరత్ కుమార్, ఈ మథ్యన 'గజనీ' కోసం సూర్య , 'శివాజి' కోసం రజనీకాంత్ తమ కురులను త్యాగం చేసేసారు. అంతే భారీ స్ధాయిలో హిట్లు కూడా కొట్టారు. దాంతో అదో సెంటిమెంట్ గా కొందరు భావించటం ఫ్రారంభమైంది. ఇలా నిర్వరామంగా కొనసాగుతున్న ఈ గుండు సాంప్రదాయాన్ని యంగ్ హీరో విశాల్ కూడా వదిలేటట్లు కనపడటం లేదు. తాజా చిత్రం 'సత్యం' క్లైమాక్స్ లో ఈ రకంగా నున్నగా గుండు గీయించుకుని కనపడబోతున్నాడట.

'ప్రేమ చదరంగం, పందెం కోడి, భరణి' చిత్రాల ద్వారా తెలుగు వారికి దగ్గరైన విశాల్ నిజానికి తెలుగువాడే. కాని మొదట నుంచి తమిళంలో సినిమాలు చేయటం అవి ఇక్కడా మంచి హిట్టవటం జరుగుతోంది. అదే కోవలో 'సత్యం' సినిమా కూడా 'సెల్యూట్' గా తెలుగులోకి వస్తోంది. విశాల్ స్వీయ బ్యానర్ లో చేస్తున్న ఈ ద్విభాషా చిత్రం ద్వారా రాజ్ శేఖర్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇందులో విశాల్ టఫ్ పోలీస్ అథికారి పాత్రను చేస్తున్నాడు. జూలై లో రిలీజయ్యే ఈ సినిమాలో నయనతార విశాల్ కి జోడీగా చేస్తోంది. అసలు గుండు చేయించుకుని నటిస్తే పాత్రకి రియల్ లుక్ వస్తుందని అభిమానులకు బాగా పడుతుందని ఈ హీరో భావనట. మరి ఈ గుండు క్లిక్ అయితే సిక్స్ ప్యాక్ క్రేజ్ లా రక రకాల గుండు లు తెలుగు తెరపై దర్శనమిచ్చే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X