'ధమ్స్ అప్' కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఈ హీరో (వీడియో)
చెన్నై: సల్మాన్ ఖాన్, మహేష్ ల కోవలోనే తమిళ హీరో విశాల్...ధమ్స్ అప్ కోల బ్రాండ్ కు అంబాసిడర్ గా మారారు. ఈ మేరకు విశాల్ తో ఓ యాడ్ ని రూపొందించి లేటెస్ట్ గా వదిలారు. పూర్తి యాక్షన్ తో సాగే ఆ యాడ్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ఈ కొత్త టీవి కమర్షియల్ యాడ్ కి ..రామ్ సంపత్ సంగీతం అందించగా..కపిల్ శర్మ... డైరక్ట్ చేసారు. ఆర్.యు ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ యాడ్ ని రూపొందించారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
విశాల్ చిత్రాల విషయానికి వస్తే...
ఎలాంటి అంచనాలు లేకుండా శివకార్తికేయన్‌తో 'ఎదిర్‌నీచ్చల్' రూపొందించి.. కమర్షియల్ పరంగా అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు దురైసెంథిల్ కుమార్.. దాంతో హీరోలంతా ఈ దర్శకుడుతో చిత్రం చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అందరికన్నా ఓ అడుగు ముందుకు వేసి విశాల్... ఈ దర్శకుడుని తన తదుపరి చిత్రానికి ఖరారు చేసుకున్నారు.

దురైసెంథిల్ కుమార్ ఇటీవల విశాల్‌కు కూడా ఓ కథ వినిపించినట్లు సమాచారం. ఆ కథ విశాల్‌కు నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నారట. ఫైవ్‌స్టార్ కదిరేశన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే అధికారిక సమాచారం వెలువడనుంది. ప్రస్తుతం ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది.


Click it and Unblock the Notifications











