హీరో విశాల్ వివాదం...మళ్లీ మొదటికి..
ఈ విషయమై నడిగర్ సంఘం మరోసారి విశాల్‌కు నోటీసులు జారీ చేయాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సంఘం మేనేజర్ పత్రికలకు వెల్లడించడం నటుడు విశాల్‌ను అసంతృప్తికి గురి చేసింది. తమిళ చిత్ర నటీనటుల సంఘం.. నడిగర్ సంఘం చర్యలపై యంగ్ హీరోలు యుద్దానికి సిద్ధం అవుతున్నారు. ఇదే విషయమై కోలీవుడ్‌లో వేడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ విషయమై కొందరు యువ నటీనటులు విశాల్ ఇంటిలో శనివారం సమావేశమై దీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. నడిగర్ సంఘం మేనేజర్ సంఘ కార్యకలాపాలను మాత్రమే వెల్లడించాలని, ఆయన నటుల వ్యవహారంలో బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేయడం అవమానించడమేనని చర్చించారని సమాచారం. వీరందరూ నటుడు విశాల్ తీసుకునే నిర్ణయానికి పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది.
'కమల్‌హాసన్ ఇంతటి సమస్య ఎదుర్కొంటుంటే నటీనటుల సంఘం ఏం చేస్తోంది?' అంటూ విశాల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన నటీనటుల సంఘం విశాల్ వ్యాఖ్య నటీనటుల సంఘాన్ని కించపరచటమే అన్న అభిప్రాయానికొచ్చింది. దీంతో సంఘానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన మిమ్మల్ని సంఘం నుంచి బహిష్కరిస్తే తప్పేంటి? అంటూ, విశాల్‌కు నోటీసులు జారీ చేసింది. విశ్వరూపం వ్యవహారంలో నడిగర్ సంఘం నటుడు విశాల్‌కు నోటీసులు పంపింది.


Click it and Unblock the Notifications












