»   » ఉద్రిక్తతల మధ్య ఎన్నికలు: హీరో విశాల్ గెలిచాడు (ఫొటోలు)

ఉద్రిక్తతల మధ్య ఎన్నికలు: హీరో విశాల్ గెలిచాడు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : దక్షిణ భారత నటీనటుల (నడిగర్‌) సంఘం కార్యవర్గ ఎన్నికల్లో హీరో విశాల్‌ నేతృత్వలోని బృందం విజయం సాధించింది. ఆదివారం రాత్రి జరిగిన ఓట్ల లెక్కింపులో శరత్‌ కుమార్‌, విశాల్‌ వర్గాలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడిన సంగతి తెలిసిందే.

చివరకు విశాల్‌ ప్యానల్‌లోని నాజర్‌ అధ్యక్షుడిగా, విశాల్‌ ప్రధాన కార్యదర్శిగా, కార్తి(సూర్య సోదరుడు) కోశాధికారిగా విజయం సాధించారు.

నడిగర్‌ అధ్యక్షుడిగా పదేళ్లపాటు చక్రం తిప్పిన శరత్‌ కుమార్‌ దాదాపు వంద ఓట్ల తేడాతో నాజర్‌ చేతిలో ఓడిపోయారు. విశాల్‌.. శరత్‌ కుమార్‌ వర్గానికి చెందిన రాధారవిపై 300 మించిన ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

స్లైడ్ షోలో ఎన్నికల విశేషాలు...ఫొటోలతో..

నాలుగు వందల ఓట్లు

నాలుగు వందల ఓట్లు

కార్తి ఏకంగా నాలుగు వందల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

తీవ్రమైన పోటీ

తీవ్రమైన పోటీ

మూడేళ్లకోమారు నిర్వహించే ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర పోటీ కనిపించింది.

ఆరోపణలు..పోలీస్ పిర్యాదులు

ఆరోపణలు..పోలీస్ పిర్యాదులు

పరస్పర ఆరోపణలు, పోలీసు ఫిర్యాదులతో ఈ ఎన్నికలు వేడెక్కాయి. హైకోర్టు నియమించిన పరిశీలకుని సమక్షంలో ఆదివారం పోలింగ్‌ జరిగింది.

తోపులాట

తోపులాట

పోలింగ్‌ సమయంలో శరత్‌ కుమార్‌, విశాల్‌ వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

విశాల్ కు గాయం

విశాల్ కు గాయం

విశాల్‌ చేతికి గాయమైంది. ఓటమి భయంతోనే తనపై దాడి చేశారని విశాల్‌ ఆరోపించారు.

వేరే వారు వేసేసారు..

వేరే వారు వేసేసారు..

కొంతమంది నటుల ఓట్లు అప్పటికే వేరేవారు వేయడంతో ఇద్దరూ వాగ్వాదాలకు దిగారు.

విశాల్ దే

విశాల్ దే

విశాల్ దగ్గరుండి మొత్తం నడిపించారని, గెలుపు అతనిదే అని నాసర్ వ్యాఖ్యానించారు

ఊహించని విధంగా

ఊహించని విధంగా

సినిమాల్లో చూపించిన విధంగానే ఎత్తులు పై ఎత్తులతో ఈ ఎన్నికలు జరిగాయి

ఉద్రిక్తతలు

ఉద్రిక్తతలు

ఈ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తలు మధ్య జరగటంతో అందరి దృష్టీ ఇటు వైపే తిరిగింది.

English summary
Actors Nasser and Vishal were declared winners and will assume the posts of Nadigar Sangam president and general secretary respectively.
Please Wait while comments are loading...