»   » రజనీకాంత్‌ను కించపరడమే అంటూ... విశాల్ దిష్టిబొమ్మ దహనం!

రజనీకాంత్‌ను కించపరడమే అంటూ... విశాల్ దిష్టిబొమ్మ దహనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దక్షిణ భారత నటీనటుల సంఘం పేరును తమిళనాడు నటీనటుల సంఘంగా మార్చాలని డిమాండ్‌ చేస్తూ తమిళ అభివృద్ధి దళం సభ్యులు శుక్రవారం స్థానిక అన్నానగర్‌లో ఆందోళన చేపట్టింది. పేరు మార్చాలన్న రజనీకాంత్‌ కోరికను లెక్కచేయక పోవడం ఆయన్ని కించపరచడమేనని పేర్కొంటూ... ఇందుకు నిరసనగా సంఘం నూతన ప్రధాన కార్యదర్శి విశాల్‌ దిష్టిబొమ్మను దళం సభ్యులు దగ్ధం చేశారు.

ప్రస్తుతం తమిళ సినీ నటుల సంఘానికి తమిళంలో ‘నడిగర్ సంఘం' అనే పేరు ఎప్పటి నుండో ఉంది. నడిగర్ సంఘం అంటే ‘దక్షిణ భారత నటీనటుల సంఘం' అని అర్థం. గతంలో చెన్నై కేంద్రంగా సౌత్ సినీ పరిశ్రమ ఉన్నపుడు తెలుగు, తమిళం, కన్నడ ఇలా అన్ని దక్షిణాది భాషల నటీనటులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నాయి.

Vishal's Effigy Burnt by Tamilar Munnetra Padai Cadres

క్రమక్రమంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఆయాభాషల ప్రాతి పదికను సినీ పరిశ్రమ వేరుగా ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం పేరు మార్చాలని, తమిళ సినీ నటీటుల సంఘంగా మార్చాలని ఇటీవల రజనీకాంత్ డిమాండ్ చేసారు. అయితే రజనీకాంత్ డిమాండుతో కమల్ హాసన్, మరికొందరు విబేధించారు.

ఇటీవల కమల్ హాసన్ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయమై స్పందిస్తూ...సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ను తమిళనాడు ఆర్టిస్టు అసోసియేషన్ గా మార్చాలని రజనీకాంత్ డిమాండ్ చేయడాన్ని విబేధించాను. ఇందులో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి లెజెండ్స్‌తో పాటు ఇతర భాషల నటీనటులున్నారు. కాబట్టి ఆ పేరును మార్చడం తప్పనిపించింది అన్నారు.

English summary
Actor Vishal's Effigy Burnt by Tamilar Munnetra Padai Cadres on friday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu