»   » 'కథాకళి'‌: విశాల్‌ ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌

'కథాకళి'‌: విశాల్‌ ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై‌: విశాల్‌, కేథరిన్‌ త్రేసా జంటగా పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళచిత్రం 'కథాకళి' చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని నటుడు విశాల్‌ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, పసంగా ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

Vishal's Interesting look for Kathakali

దర్శకుడు పాండి రాజ్ మాట్లాడుతూ.., "మీ అందరి ఆశీస్సులతో...నా తదుపరి చిత్రం కథాకళి ప్లాన్ చేసాను. ఈ చిత్రం విశాల్ ఫిల్మ్ ప్యాక్టరీ మరియు పసంగ ప్రొడక్షన్స్ కలిపి నిర్మిస్తాయి. ఇది జాయింట్ వెంచర్" అన్నారు. పిడికిలి బిగించిన పోస్టర్‌తోపాటు విశాల్‌ కళ్ళు అగ్నిగోళాల్లా మండి పోతున్న మరో పోస్టర్‌ ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Vishal's Interesting look for Kathakali

రీసెంట్ గా సూర్య నిర్మాణంలో పసంగ-2, శింబు, నయనతార జంటగా 'ఇదు నమ్మ ఆలు' చిత్రాలను పూర్తిచేసిన దర్శకుడు పాండిరాజ్.. ఇప్పుడు విశాల్ హీరోగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. గత నెల రోజులుగా చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఇక కథాకళి చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో విశాల్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కొంబన్ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు ముత్తయ్య ఇప్పుడు విశాల్‌ను డెరైక్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి మరుదు అనే పేరును ఖరారు చేశారు.

Vishal's Interesting look for Kathakali

దర్శకుడు ముత్తయ్య ఇంతకు ముందు చేసిన కుట్టిపులి, కొంబన్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన లక్ష్మిమీనన్‌నే ఈ మరుదు చిత్రంలో హీరోయిన్ గా నటింపజేయాలని భావించినట్లు సమాచారం.

అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా నటి శ్రీదివ్యను ఆ అవకాశం వరించింది. మరో విషయం ఏమిటంటే ఇటీవల జరిగిన దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లో కార్యదర్శి పదవికి పోటీ పడి ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకున్న విశాల్, రాధారవి ఈ చిత్రంలో నాయకుడు, ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మరుదు చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

English summary
Vishal is currently busy with the shooting of Pandiraj's action thriller. Interestingly the film's title has been announced as 'Kathakali'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu