»   »  బన్నీ డేట్స్ ఇచ్చాడని ఆపేసాడు...విశాల్ కు కాలి,కంప్లైంట్

బన్నీ డేట్స్ ఇచ్చాడని ఆపేసాడు...విశాల్ కు కాలి,కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళంలో ఉండే విశాల్ కు, ఇక్కడ వెలుగుతున్న అల్లు అర్జున్ కు లింక్ ఏమిటా అనుకుంటున్నారా...తమకు కూడా తెలియకుండా వేరే వారి విషయాల్లో తాము విలన్స్ లా మారిపోయే సిట్యువేషన్స్ వస్తూంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల..విశాల్ ఎప్పటినుంచో అనుకుంటున్న ప్రాజెక్టు ఆగిపోయింది. అదెలా అంటే..మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

విశాల్ కెరీర్ లో పెద్ద హిట్ చిత్రం పందెం కోడి. తెలుగు,తమిళ భాషల రెండింటిలోనూ ఘన విజయం సాధించింది. ఈ మధ్యనే కాస్త హిట్ లతో ఫామ్ లోకి వచ్చిన విశాల్..ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. దీనికి లింగు స్వామి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పుడో కొత్త ట్విస్ట్ అల్లు అర్జున్ రూపంలో వచ్చి పడింది.

Vishal's 'Pandemkodi 2' Shelved, Actor Says Film-maker Lacks Commitment!

దాంతో ‘పందెంకోడి 2' చిత్రానికి సంబంధించి నటుడు విశాల్‌, దర్శకుడు లింగుస్వామిల మధ్య వివాదం కొనసాగుతోంది. వీరిద్దరి కలయికలో ఘనవిజయం సాధించిన ‘పందెంకోడి'కి సీక్వెల్‌ను ప్రారంభించనున్నట్లు ఇటీవల ప్రకటించారు.కానీ లింగుస్వామి అల్లు అర్జున్‌తో మరో చిత్రం చేస్తూ, ‘పందెంకోడి2'ని ఆపేశారు. ఈ విషయమై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు విశాల్‌.

విశాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం 14 నెలలు వేచి చూశా. అయితే సకాలంలో ప్రారంభించనందువల్ల ‘కథకళి', ‘మరుదు' చిత్రాలను ఆరంభించా. 15 రోజుల కిందటి వరకు లింగుస్వామి, అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్న విషయం కూడా తెలియదు. ‘పందెంకోడి 2' కోసం అడ్వాన్సు కూడా ఇచ్చానని తెలిపారు.

దీనిపై లింగుస్వామి స్పందిస్తూ.. ఈ సమస్యను పెంచి పెద్దజేయాలని అనుకోవడం లేదు. నా తదుపరి చిత్రంలో అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. అందువల్లే ‘పందెంకోడి 2'ను ఆపేశామని చెప్పారు.

English summary
Director Lingusamy drops Vishal's film for Allu Arjun project
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu