హీరో విశాల్‌కు గాయాలు, 22 కుట్లు (ఫోటో)
హైదరాబాద్: తమిళ హీరో విశాల్ షూటింగు స్పాట్లో గాయపడ్డారు. 'పూజై' అనే తమిళ చిత్రం షూటింగ్ జరుగుతుండగా అతని చేతి వేలికి తీవ్రమైన గాయం అయింది. విశాల్‌ను వెంటనే యూనిట్ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ గాయానికి వైద్యులు 22 కుట్లు వేసి వైద్యం చేసినట్లు తెలుస్తోంది.
కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చెన్నైలోని మోహన్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఫైట్ మాస్టర్ కమల్ కన్నన్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తుండగా....జంపింగ్ సీన్ చేస్తుండగా అతని చేతికి గాయమైంది.

ఈ సంఘటనలో విశాల్ ఎడమ చేతి వేలికి గాయమైంది. వైద్యులు వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే షూటింగ్ ఆపడానికి విశాల్ ఇష్ట పడటం లేదని, ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే కావడంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుందని, అందుకే షూటింగ్ కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
పూజై చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విశాల్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నటుడు సత్యరాజ్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. దీపావళికి ఈచిత్రం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











