twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సవాల్: నిరూపిస్తే.. నేనే తప్పుకుంటా :విశాల్‌

    By Srikanya
    |

    చెన్నై : నటీనటుల సంఘం నిర్వాహకులను దూషించినట్లు నిరూపిస్తే తాను సంఘం నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు విశాల్‌ తెలిపారు. దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్‌ బుధవారం తిరుచ్చిలో మాట్లాడుతూ.. ''విశాల్‌ ఇదేవిధంగా ఆరోపణలు, దూషించేలా మాట్లాడితే సంఘం నుంచి తప్పిస్తాము''అని చెప్పారు.

    విశాల్‌ స్పందిస్తూ... ''శరత్‌కుమార్‌ మాటలు విని ఆశ్చర్యపోయా. నటీనటుల సంఘంపై నాకు ఎంతో గౌరవముంది. నేను తప్పుచేసినట్లు నిరూపిస్తే.. సంఘం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోతా. ఆయన మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. సంఘం కార్యదర్శి రాధారవి, ఉపాధ్యక్షులు కేఎన్‌ కాలైలు ఇటీవల ఓ కార్యక్రమంలో కించపరిచేలా మాట్లాడారు. కానీ ఆయన వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారి తీరును కూడా పరిగణనలోకి తీసుకోవాలి''అని పేర్కొన్నారు.

    Vishal speaks up against Sarath Kumar

    కొద్ది రోజుల క్రితం...

    నటుడు విశాల్‌, నాజర్‌ను విమర్శిస్తూ మాట్లాడిన నటుడు, నటీనటుల సంఘం కార్యదర్శి రాధా రవి, కాలైలకు నటీనటుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల తిరుచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో రాధారవి, కాలైలు.. విశాల్‌, నాజర్‌లను విమర్శిస్తూ ప్రసంగించినట్లు సమాచారం. వారు మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో ఆగ్రహానికి గురైన విశాల్‌, నాజర్‌లు నటీనటుల సంఘానికి విడివిడిగా ఫిర్యాదు చేశారు.

    తమ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వారు మాట్లాడారని ఫిర్యాదు చేశారు. 'చండమారుతం' చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ వెళ్లిన శరత్‌కుమార్‌ సోమవారం చెన్నైకి వచ్చారు. ఈ విషయమై నటీనటుల సంఘం అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్‌.. రాధారవి, కాలైలకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30వ తేదీన జరుగనున్న కార్యవర్గ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని ఈ నోటీసులో ప్రస్తావించారు.

    విశాల్ తాజా చిత్రం గురించి ...

    విశాల్ హీరోగా నటించి విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం పూజ. హరి దర్శకత్వం వహించారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరో విశాల్ మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సూపర్ సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా వుంది. తెలుగులో ఇప్పటి వరకు రిలీజ్ అయిన నా సినిమాల్లో పూజ వసూళ్ల పరంగా ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. అనువాద చిత్రంగా కాకుండా స్ట్రెయిట్ చిత్రంలా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.

    శృతిహాసన్ కాంబినేషన్‌లో నేను చేసిన తొలి చిత్రమిది. ఆమె సహకారంతో ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించగలిగాను. హరి దర్శకత్వంలో గతంలో భరణి చిత్రం చేశాను. ఏడేళ్ల విరామం తరువాత మా ఇద్దరి కలయికలో వచ్చిన పూజ ఇంత పెద్ద హిట్ కావడం ఆనందంగా వుంది. హరితో మరిన్ని చిత్రాలు చేస్తాను. ఈ చిత్ర విజయం పట్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు చాలా సంతోషంగా వున్నారు అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఇప్నటి వరకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో చేసిన చిత్రాలన్నీ పెద్ద విజయం సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్‌ను సొంతం చేసుకోవడం ఆనందంగా వుంది అన్నారు.

    English summary
    Vishal pro-active stance on many issues facing the industry such as piracy, has sent a press statement in relation to a speech by the Nadigar Sangam President and actor Sarath Kumar today at a meeting in Trichy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X