»   »  మొదటిదే రిలీజ్ లేదు..అయినా ఇంకోటి

మొదటిదే రిలీజ్ లేదు..అయినా ఇంకోటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : సుందర్‌.సి, విశాల్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే తెరకెక్కిన చిత్రం విడుదలకు నోచుకోని నేపథ్యంలో తాజాగా మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. కొంతకాలం పాటు నటుడిగా కొనసాగిన సుందర్‌.సి మళ్లీ మెగాఫోన్‌ పట్టుకుని కొన్ని హిట్‌ చిత్రాలు రూపొందించారు. విశాల్‌ హీరోగా, వరలక్ష్మి, అంజలి ఆయనకు జంటగా 'మదగజరాజా'ను రూపొందించారు. చిత్రీకరణ పూర్తెనా.. అనివార్య కారణాలతో విడుదలకు నోచుకోలేదు.

ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్‌లో 'ఆంబళ' అనే చిత్రం రూపొందనుంది. విశాల్‌కు జంటగా హన్సిక ఆడిపాడనుండగా.. ప్రభు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూర్చుతారు. విశాల్‌కే చెందిన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరి ఈ సినిమా నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Vishal, Sundar C. Get Going Again

విశాల్‌ మాట్లాడుతూ '' నాన్న, అన్నయ్య స్థాపించిన నిర్మాణ సంస్థలు ఉన్నప్పటికీ నేను నిర్మాతగా మారానంటే కారణం అదే. ప్రతీ హీరోకీ ఓ మలుపు ఉంటుంది. ఆ మలుపు దర్శకుడితోనే వస్తుంది. ఈ కథ చెప్పినప్పుడు నా సినీ జీవితానికి మలుపునిచ్చే చిత్రమిదే అవుతుందనిపించింది. ''అన్నారు.

తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నాను. నిర్మాతగా మారడంతో ఆ సినిమా ఆలస్యమైంది. శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న తెలుగు సినిమాని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాము అన్నారు.

English summary
Remember “Madha Gaja Raja”? The film that created a big buzz but was never released. Yes, Vishal and Sundar C, the lynchpins of that film, are back together. The two have started shooting for their new film, with Vishal and comedian Sathish joining the sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu