తమిళ నటుడు విష్ణు విశాల్ ఈ మధ్య తరచూ సినిమాయేతర అంశాలతో వార్తల్లో నిలుస్తున్నారు. గతేడాది తన భార్య రజనీతో విడాకులు తీసుకున్న ఈ యాక్టర్... బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తాతో రిలేషన్ మొదలు పెట్టినట్లుగా చర్చించుకుంటున్నారు.
జూన్ 3న విష్ణు విశాల్ తన ట్విట్టర్ పేజీలో జ్వాలతో క్లోజ్‌గా ఉన్న ఫోటో పోస్ట్ చేయడంతో.... చాలా మందిలో అనుమానాలు మొదలయ్యాయి. కొందరు నేరుగా మీరు డేటింగులో ఉన్నారా? లేదా? క్లారిటీ ఇవ్వండి అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు.
తమ మధ్య రిలేషన్‌షిప్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై విష్ణు విశాల్ ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. మా మధ్య దాదాపు సంవత్సర కాలంగా పరిచయం ఉంది. మాకు చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా సందర్భాల్లో స్నేహితులతో కలిసి సమయం గడిపినట్లు తెలిపారు.
డేటింగులో ఉన్నారా? అనే అంశంపై విష్ణు విశాల్ స్పందిస్తూ.... 'వ్యక్తిగతంగా ఒకరంటే ఒకరు ఇష్టపడతాం. అయితే ఇంత ముందుగా ఈ విషయంలో ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. దీని(రిలేషన్) కంటే కూడా మాకు మా ప్రొఫెషన్ ముఖ్యం' అని వ్యాఖ్యానించారు.
అయితే విష్ణు విశాల్ చెప్పిన వివరాలు బట్టి... ఇద్దరి మధ్య ఇప్ప్పుడిప్పుడే సాన్నిహిత్యం మొదలైన విషయం స్పష్టమవుతోంది. ఇద్దరూ డైవర్సీలే, ఒకపై ఒకరికి ఇష్టం కూడా ఉంది కాబట్టి ఈ రిలేషన్ ఎక్కడి వరకు వెళుతుందనేది కాలమే నిర్ణయించాలి.
After the photos went viral on social media, Vishnu Vishal decided to address rumours about rumoured relationship with. In an interview to Times of India, he said, "We like each other as individuals and anything beyond that, at this point of time, is too early for comment. Yes, there's a liking for each other, but for both of us, it's (relationship) just taking a back seat because we have lots of work professionally."
Story first published: Thursday, June 6, 2019, 18:44 [IST]