»   » పంచ్: తుపాకి ఉన్నవాడు పెద్దగా మాట్లాడడు

పంచ్: తుపాకి ఉన్నవాడు పెద్దగా మాట్లాడడు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: షూటింగ్ ప్రారంభానికి ముందు పేరు ఏం పెట్టాలని ఆలోచించాం. ఆరు నెలల తర్వాత చూదాంలే అని అజిత్‌ అన్నారు. షూటింగ్‌తో ఇంకాం ఆలస్యమైంది. దాదాపు చివరికి వచ్చాక సుమారు రెండొందల పేర్లను అజిత్‌కు ఇచ్చాం. వాటన్నింటినీ చూసి.. కథకు సంబంధం లేని పేరును పెట్టి ప్రేక్షకులను ఏమార్చడం సరికాదని చెప్పారు. అందువల్లే అందరి అభిప్రాయాలను క్రోడీకరించి 'ఆరంభం' అనిపెట్టాం. కథ ప్రకారం ఆయన ఓ విషయాన్ని ప్రారంభిస్తారు... తర్వాత అది ప్రభంజనంగా మారుతుంది. అందువల్లే చివరకు ఆ పేరు ఖాయమైంది అని విష్ణు వర్ధన్ చెప్పుకొచ్చారు.


  'మంగాత్తా'లో సహజ కేశాలంకరణతో నటించిన అజిత్‌.. ఇప్పుడు 'ఆరంభం'లోనూ అదేవిధంగా కనిపించనున్నారు. 'వీరన్‌', 'ధీరన్‌', 'సురాంగని'.. వంటి పలు పేర్ల పరిశీలన తర్వాత ఏమాత్రం హడావిడి లేకుండా 'ఆరంభం' అని పేరు ఖరారు చేశారాయన. 'బిల్లా'లో 'తల'ను స్త్టెలీష్‌గా చూపి భారీ విజయం దక్కించుకున్న విష్ణువర్దనే ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు సాగుతున్నాయి. తమ కలయికలో వచ్చిన గత చిత్రాన్ని మించి దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు విష్ణు.


  అలాగే 'బిల్లా' విజయం చాలా భిన్నమైనది. అజిత్‌ అంటే గుర్తొచ్చే సినిమాగా మారిపోయింది. అందులో ఆయన ప్రతి కదలిక వైవిధ్యంగా, స్త్టెలీష్‌గా ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను ఎదురుచూసిన దానికన్నా మరిన్నిరెట్లు ఎక్కువగా వర్కవుట్‌ అయింది. మళ్లీ మనం కలిసి ఓ సినిమా చేద్దామని చెప్పా. 'మరి మనమిద్దరం కలిస్తే.. గ్యాంగ్‌స్టర్‌ చిత్రమేనన్న ముద్ర నాటుకుపోయింది. అది కనిపించకూడద'ని అజిత్‌ అన్నారు. అప్పుడు 'ఆరంభం' కథ చెప్పా. భిన్నంగా ఉండటంతో నటించడానికి ఒప్పుకున్నారు. అజిత్‌ అంటే అందరికీ ఇష్టమే. ఈ చిత్రంతో ఏ కొద్దిమందో మిగిలి ఉంటే వారూ అభిమానిస్తారు. 'బిల్లా'కన్నా కాస్త ఎక్కువే శ్రమించా. ఆ విషయం విడుదల తర్వాత మీకే తెలుస్తుంది అన్నారు.


  'ఆరంభం' గతంలో వచ్చిన 'బిల్లా'ను మించిన వేగంతో ఉంటుందని దర్శకుడు విష్ణువర్ధన్‌ పేర్కొంటున్నాడు. అజిత్‌కు జంటగా నయనతార నటిస్తుండగా, మరో జంటగా ఆర్య-తాప్సీ కనిపించనున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా అజిత్ కెరీర్ లో పెద్ద హిట్ నమోదు చేస్తుందని హామీ ఇస్తున్నాడు. విష్ణువర్ధన్‌ మాట్లాడుతూ.. 'బిల్లా'లాంటి మెగాహిట్‌ తర్వాత అజిత్‌తో మరోసారి పని చేయటం ఆనందంగా ఉంది. 'మంగాత్తా'లో సగానికి పైగా నెరసిన వెంట్రుకలతో కనిపించిన అజిత్‌ ఇందులోనూ అదే గెటప్‌లో అలరించనున్నాడు. అలా చూపాలని మా యూనిట్‌ ముందుగానే అనుకుంది. వెంకట్‌ ప్రభు మాకన్నా వేగంగా స్పందించి 'మంగాత్తా'లో ఆ క్రెడిట్‌ కొట్టేశాడు. 'ఆరంభం' ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. స్క్రీన్‌ప్లేలో 'బిల్లా'ను మించే వేగం ఉంటుంది. తమిళ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుందని వివరించాడు.


  కథ గురించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. ఇంకా చాలా పనులున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ప్రతి ఫ్రేమూ ఎంతో కష్టపడి చిత్రీకరించాం. కేవలం అజిత్‌ అభిమానులకే కాదు.. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పగలను. అజిత్‌కు తగ్గట్టు పలు పంచ్‌ డైలాగులున్నాయి. 'తుప్పాక్కి వైతిరుక్కురవన్‌ పేసమాట్టాన్‌'.. (తుపాకి ఉన్నవాడు పెద్దగా మాట్లాడడు) వంటి సంభాషణలు థియేటర్‌లో పేలడం ఖాయం. అజిత్‌, ఆర్య కలయిక అనుకున్నట్టే క్లిక్‌ అయింది. ఇక ప్రేక్షకుల ముందు తెరపై పండటమే మిగిలి ఉంది. ఆ విషయాన్ని త్వరలో మీరే చూస్తారుగా అని ముగించారు.

  English summary
  Vishnuvardhan says...' Ajith plays the central character with an characterization of a valiant warrior. Arya and Nayanthara play important characters that circle around Ajith. Ajith sir is on his popular salt and pepper get up of 'Mankaatha'. In fact i had requested Ajith sir to introduce that get up in my film only but Venkat prabhu over took me and the rest was history .This look suits Ajith sir so well and i honestly believe no body can match him in this style...This is an action drama, pacy and racy script. It will be much faster than our earlier film together Billa. This film will be an absolute entertainer , not only to Ajith sir's fans but also to classes and masses alike'.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more