»   » కమల్ కు బాధ ఏమో కానీ, ఆయన ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే వార్తే ఇది

కమల్ కు బాధ ఏమో కానీ, ఆయన ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే వార్తే ఇది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తను ఎంతో ఇష్టపడి నటుడుగా, దర్శకుడుగా చేసిన సినిమా ఆగిపోయిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది. అందులోనూ మొదటి భాగం రిలీజై హిట్టై, రెండో భాగం ఆగిపోతే పరిస్దితి ఎంత భాధాకరంగా ఉంటుంది. అందుకే కమల్ సీన్ లోకి దిగాల్సి వచ్చింది.

రిలీజ్ కు ముందు తర్వాత ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కమల్‌హాసన్‌ 'విశ్వరూపం' చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రెండో భాగంగా 'విశ్వరూపం- 2' దాదాపుగా పూర్తయి నాలేగేళ్లు పైగా కావస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్‌ ఫిలిమ్స్‌ అధినేత ఆస్కార్‌ రవిచంద్రన్‌ వద్ద ఉంది. అయితే కొన్ని కారణాలతో సినిమా విడుదల కాలేదు. అయితే ఆ సినిమా గురించి ఎదురుచూసే అభిమానులకు ఓ ఆనందపడే వార్త తమిళ సిని వర్గాల నుంచి వినపడుతోంది.

'విశ్వరూపం-2'ని ఆపేశారేమో అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో, ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారనే వార్త వినపడుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతన్ననట్లు సమాచారం. అయితే కమల్ తాను స్వయంగా రంగంలోకి దిగి టేకోవర్ చేసుకుని, తన బ్యానర్ పై రిలీజ్ చేయబోతున్నట్లు వినికిడి. ఈ చిత్రం గురించి ఒక పాట, కొంత ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా పూర్తయిందట.

తను ప్రస్తుతం డైరక్ట్ చేస్తున్న 'శభాష్ నాయుడు' పూర్తి కాగానే, 'విశ్వరూపం-2' పనులు మొదలుపెట్టాలని కమల్ అనుకుంటున్నారని సమాచారం. దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారనే టాక్ రాగానే అభిమానులు ఆనందంతో సంబారాలు చేసుకుంటున్నారు. ఈలోపే 'శభాష్ నాయుడు' రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రంలో మేజర్ వసీం ఆహ్మద కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.

స్లైడ్ షో లో మరిన్ని విశేషాలు, చిత్రం ఫొటోలతో...

అప్పుడే ప్లానింగ్..

అప్పుడే ప్లానింగ్..

వాస్తవానికి తొలి భాగం తీస్తున్నప్పుడే మలి భాగాన్ని కూడా కమల్ ప్లాన్ చేశారు. ఫస్ట్ పార్ట్ చిత్రీకరణ సమయంలోనే 'విశ్వరూపం-2'కి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను కూడా తీశారు.

ఆ తర్వాత

ఆ తర్వాత

'విశ్వరూపం' -1 తర్వాత కమల్ 'పాపనాశం', 'ఉత్తమవిలన్', 'చీకటి రాజ్యం' చిత్రాల్లో నటించారు. ఇప్పుడు 'శభాష్ నాయుడు' చిత్రం చేస్తున్నారు.

ఆర్దిక సమస్యలే

ఆర్దిక సమస్యలే

విశ్వరూపం-2 సినిమాకు కూడా విడుదల కష్టాలు తప్పడం లేదు. సినిమా పూర్తయి చాలాకాలమే అయినా.. ఆర్థిక సమస్యలతో ఈ సినిమా రిలీజ్ కావడం లేదు.

అదే దెబ్బ కొట్టింది

అదే దెబ్బ కొట్టింది

ఈ సినిమాకు నిర్మాత అయిన ఆస్కార్ రవిచంద్రన్ ఆపై 'ఐ' వంటి భారీ పరాజయాన్ని చవిచూశాడు. దీంతో విశ్వరూపం-2 కు విడుదల సమస్య పట్టుకుంది.

అప్పట్లో

అప్పట్లో

అప్పట్లో ..ఈ సినిమాకు దర్శకుడు కూడా అయిన కమల్ హాసనే.. విడుదల ఎందుకు లేటవుతుందో నాకు తెలియదన్నారంటే.. సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

కమల్ సొంతం చేసుకుని

కమల్ సొంతం చేసుకుని

ఈ సినిమా హక్కులను రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ సంస్థ సొంతం చేసుకోబోతోందట.

చర్చలు కొలిక్కి వచ్చే..

చర్చలు కొలిక్కి వచ్చే..

విశ్వరూపం-2 నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కు.. కమల్ హాసన్ కు మధ్య ఈ సినిమా విషయమై ప్రస్తుతం చర్చలు జరుగి ఓ కొలిక్కి వచ్చాయంటున్నారు.

టేకోవర్

టేకోవర్

ఇందులో భాగంగా... కమల్ కు చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థ.. ఈ సినిమాను టేకోవర్ చేసి, విడుదవల చేయబోతున్నట్టు తెలుస్తోంది.

సమాధానాలు

సమాధానాలు

ఇక విశ్వరూపం చిత్రంలో అర్ధాంతరంగా వదిలేసిన కొన్ని ప్రశ్నలకు.. ఈ సీక్వెల్ లో సమాధాన లభించనుంది.

వీరంతా..

వీరంతా..

ఫస్ట్ పార్ట్ లో నటించిన పూజాకుమార్‌, ఆండ్రియా, రాహుల్‌ బోస్‌, శేఖర్‌కపూర్‌.. ఈ సీక్వెల్ లోనూ నటించగా.. జిబ్రాన్ సంగీతం సమకూర్చాడు.

అంచనాలు , ఓపినింగ్స్

అంచనాలు , ఓపినింగ్స్

ఇక కమల్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. దాంతో మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు.

అందుకే గ్యాప్ లో ...

అందుకే గ్యాప్ లో ...

"ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా నేను ఐడిల్ గా కూర్చోలేను. అందుకే నేను ఉత్తమ విలన్, పాప నాశమ్ చిత్రాలు చేసాను ." అన్నారు.

ఉగ్రవాద ప్రస్దావన

ఉగ్రవాద ప్రస్దావన

రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది.

అనుబంధం సైతం

అనుబంధం సైతం

దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు.

ఉత్కంఠగా

ఉత్కంఠగా

ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.

అవన్ని చూడొచ్చు

అవన్ని చూడొచ్చు

ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు.

మరింత అద్బుతంగా

మరింత అద్బుతంగా

ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి.

వాటినే హైలెట్ గా ..

వాటినే హైలెట్ గా ..

తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

మేజర్ గా..

మేజర్ గా..

విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రంలో మేజర్ వసీం ఆహ్మద కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు.

తల్లి పాత్రను

తల్లి పాత్రను


ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.

English summary
Vishwaroopam 2 release was postponed many times, and even after three years since the release of the first part, the makers have not come up with an official release date.It is now speculated that Vishwaroopam 2 might finally release for this Diwali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X