చెన్నై : పాత్రలో లీనమై నటించటం కోసం కొంతమంది నటులు డెడికేషన్ తో తమదైన ప్రయత్నాలు చేస్తూంటారు. అందుకోసం కొందరు సిక్స్ ప్యాక్ లు పెంచితే మరికొంతమంది కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు వంటివి నేర్చుకుని విజృంభిస్తూంటారు. కమల్, విక్రమ్ వంటి నటులు తమ బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుని అలరిస్తూంటారు. అయితే లాంగ్వేజ్ నేర్చుకుని పాత్రకు ప్రాణం పోసేవారు అరుదు. తమిళ కమిడియన్ వివేక్ ఇప్పుడు సంస్కృతం నేర్చుకుని అలా వార్తల్లో నిలిచాడు.
సందేశాత్మక హాస్య గుళికలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే వివేక్ శైలి. అందరూ నవ్విస్తారు.. నేను నవ్విస్తే.. నవ్వే వ్యక్తి సమాజసేవ కోణంలోనూ ఆలోచించాలని చెబుతుంటారు వివేక్. అందుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆయన కామెడీ. చాలా విరామం తర్వాత వివేక్ తెరపై కనిపించబోతున్నారు.. అదీ హీరోగా. రాసయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'నాన్‌దాన్ బాలా' అని పేరుపెట్టారు. వెంకట్ క్రిష్ సంగీతం సమకూర్చారు.
ఇందులో వివేక్ అమాయక బ్రాహ్మణుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా సంస్కృతం నేర్చుకున్నారు. వేలుక్కుడి కృష్ణన్ అనే పండితుల వద్ద ఆయన శిష్యరికం చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పలు శ్లోకాలు, సినిమాకు సంబంధించిన కొన్ని మాటలను నేర్చుకున్నారట వివేక్. ఇప్పటికే ఈ సినిమా గోడపత్రికలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. రానున్న 13వ తేదీన చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారు.
Naan Thaan Bala is a film that features actor Vivekh in the lead role. He is essaying the role of a Hindu priest at a temple in Kumbakonam. This film will be a totally different from the characters that Vivekh has played so far. In order to stay true nature of all things in the film, Vivek has attended Sanskrit classes and also has rendered his own voice for dubbing in Sanskrit. This is touted to be a full-fledged commercial movie
Story first published: Sunday, June 8, 2014, 12:18 [IST]