twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే నాకు దక్కిన అపూర్వ గౌరవం:కమల్‌హాసన్‌

    By Srikanya
    |

    చెన్నై : దేశం నుంచి ఆస్కార్‌ పురస్కారాల పరిశీలనకు తమిళనాడు నుంచి అధికంగా వెళ్లిన చిత్రాలు విశ్వనటుడు కమల్‌హాసన్‌వి అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన 'విశ్వరూపం' కూడా ఈ పరిశీలనకు ఎంపికైంది. చివరకు 'ది గుడ్‌ రోడ్‌' దేశం తరఫున ఆస్కార్‌ పోటీలకు వెళ్లింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్కార్ కి వెళ్లటమే తనకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తాను అన్నారు.

    కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ''ఇదివరకు నేను నటించిన ఏడు సినిమాలు ఈ పోటీలకు వెళ్లొచ్చాయి. పురస్కారం లభించిందా.. లేదా.. ముఖ్యం కాదు. పోటీలో పాల్గొనడమే నాకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నా. ఈ విషయమే చాలా గొప్పగా అనిపిస్తుంది. సత్యజిత్‌రే సినిమాలు భారత ప్రత్యేకతను అంతర్జాతీయస్థాయిలో చాటాయి. అమెరికా దృష్టిలో మనం ప్రస్తుతం కేవలం సందర్శకులు, పర్యాటకులు మాత్రమే''అని చెప్పారు.

    ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం 'విశ్వరూపం-2'. త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్దితుల్లోనూ 'డీటీహెచ్'లో (డెరైక్ట్ టు హోమ్) విడుదల చేస్తానని కమల్ చెప్తున్నారు. గతంలో 'డీటీహెచ్'లో ప్రకటించగానే భారీ ఎత్తున వివాదం చెలరేగింది. థియేటర్లో విడుదల చేసిన రోజునే టీవీల్లో సినిమా వచ్చేస్తే మా పరిస్ధితి ఏంటి అంటూ తమిళనాడులోని ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున వ్యతిరేకించి బ్రేక్ వేసారు. కానీ, ఇప్పుడు 'విశ్వరూపం 2'ని ఈ విధానం ద్వారా విడుదల చేయాలని కమల్ అనుకుంటున్నారు.

    'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

    కమల్ మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.

    English summary
    
 Kamal Haasan, whose directorial Vishwaroopam was in the race with other films for Indias official entry to Academy Awards this year, is not disappointed at losing the opportunity. Instead he feels it would be more sensible when Indian talent works in American movies and wins an Oscar. "With due respect, my films have gone seven times to the Oscars but I think it will make more sense when the Indian talent takes part in American movies and wins an Oscar or it must be like the way Ray saab (Satyajit Ray) did for world cinema. Otherwise, we are just visiting America, we are tourists," Haasan told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X