»   » చెప్పుకోలేక మొహం చాటేస్తున్న నయనతార

చెప్పుకోలేక మొహం చాటేస్తున్న నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

నయనతార గత కొద్ది రోజులుగా ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ఆమె ఎక్కడ కనిపించినా జనం ఆమెకు,ప్రభుదేవాకు పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారట.దాంతో వారికి సమాధానం చెప్పలేక నయనతార ముఖం చాటేస్తుందని అంటున్నారు.మరో ప్రక్క ప్రభుదేవా కూడా నయనతారతో తన పెళ్లి గురించి ఇప్పుడు ఎక్కడా నోరుమెదపడంలేదు.దాంతో నయనతార పరిస్ధితి అయోమయంలో పడిపోయింది.అందులోనూ ఏప్రిల్‌లో వీరిద్దరి పెళ్లి జరుగనున్నట్లు మూడు నెలల క్రితమే వార్తలు వచ్చాయి.అంతేగాక ప్రభుదేవాతో పెళ్లి తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్తుందంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ వస్తోంది.

మరో ప్రక్క ప్రభుదేవా, నయనతార చాలాకాలంగా కలిసి సహ జీవనం చేస్తున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. దానికి తగ్గట్లే ఆ మధ్య ప్రభుదేవా భార్య రమలత వారిద్దరూ తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, తనకు న్యాయం చేయాలని మహిళా సంఘాలను ఆశ్రయించారు. అంతేగాక చెన్నైలో నయనతార కనిపిస్తే కొట్టేస్తానంటూ బహిరంగంగానే హెచ్చరించారు.దానికి ప్రభుదేవా కోర్టు బయిటే సెటిల్మెంట్ చేసుకున్నారు.నయనతార ప్రస్తుతం బాలకృష్ణ సరసన 'శ్రీరామరాజ్యం" చిత్రంలో నటిస్తూ బిజీగా వుంది. అలాగే ప్రభుదేవా తమిళంలో విశాల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Nayantara, Prabhu Deva may be in love, but marriage is not on the cards in the near future as they are both highly professional people who are concerned about their respective careers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu