»   »  దశావతారం కథ ఇదేనా...

దశావతారం కథ ఇదేనా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dasavatharam
ఇప్పుడు కమల్ అభిమానులే కాక భారత సినీ ప్రేమికులు మొత్తం ఎదురుచూస్తున్న సినిమా దశావతారం. ఈ నెల పదమూడవ తేదీన వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ రజనీ 'శివాజీ' తర్వాత అత్యంత వ్యయం (65 కోట్లుతో) నిర్మించిన కావటంతో అందరి కళ్ళూ దీని పైనే ఉన్నాయి. దాంతో దశావతారం లో ప్రతీ చిన్న విషయమూ సంచలనమవుతోంది. ఇప్పుడు దాని కథ గురించి అందరూ తలో రకంగా చెప్పుకుంటున్నారు.దానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు నుంచి దట్స్ తెలుగు చెన్నై ప్రతినిథి సేకరించన దాని ప్రకారం ...దశావతారం కథ కొత్తదేమీ కాదట.

గతంలో ఎమ్.జి.రామ్ చంద్రన్ నటించిన Ulagam Sutrum Vaaliban సినిమా కథని మోడరన్రైజ్ చేసారట. కథ ప్రకారం ఒక కమల్ హాసన్ అమెరికాలో సైంటిస్టుగా పనిచేస్తూండు. అతను ఎంతో కష్టపడి అణు సిద్దాంతాలు మధించి అణు సంయోజనం(atomic fission) వంటిది కనుక్కుంటాడు. దానిని సరిగా వినియోగిస్తే మానవాళికి చాలా లాభ పడుతుంది. కాని దుర్వినియోగం చేస్తే చాలా ప్రమాదం. అలాంటి దాన్ని అక్కడుండే మరొక కమల్ (తెల్ల జాతి వాడుగా కమల్) కొంతమందిని కలుపుకుని దాన్ని దొంగిలించటానికి ప్రయత్నం చేస్తాడు.

అది గమనించిన ఆ సైంటిస్టు దాన్ని జాగ్రత్తా ఇండియా పంపుతాడు. అది అటుతిరిగి ఇటు తిరిగి చివరకు ఓ తొంభై ఏళ్ళ ముసలామె(కమల్) వద్దకు చేరుతుంది. అక్కడనుండి దొంగతనం చేద్దామనుకున్న వారు దాన్ని ఎట్లా సంపాదించాన్న పాయింటు చుట్టూ టెన్షన్ గా కథ తిరుగుతుంది. ఈ మధ్యలో కధానుగుణంగా ఇండియాలో మిగతా పాత్రలు కనిపించి థ్రిల్ చేస్తాయంటున్నారు. ఇక ఈ సినిమాలో మంచి ఫిలాసఫి కూడా ఉంటుందిట. అలాగే జార్జిబుష్ గా,కరుణానిథిగా,జయలలితగా కమల్ కనపడి ప్రేక్షకులకు కనువిందు చేస్తాడు.

ఇక మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాలో కమల్ పది గెటప్స్ తో కనిపిస్తాడు. ఆస్కార్ రవిచంద్రన్ ప్రతిష్ఠాత్మకంగా దీన్ని కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందించారు. మొదట ప్రకటించిన విధంగా ఈ నెల 12 వ తేదిన యు.స్,సౌత్ ఈస్ట్ ఆసియా,యూ.కె.లలో రిలీజ్ చేస్తున్నారు.. ఇండియాలో ఆ తర్వాత రోజు రిలీజవుతోంది. 1000 కి పైగా ప్రింట్లతో వస్తున్న ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X