twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఇంగ్లీష్‌ - వింగ్లీష్‌' తమిళ టైటిల్ ఏంటి?

    By Srikanya
    |

    చెన్నై: తమిళనాట టైటిల్స్ కు తమిళంలోనే పెట్టాలి అనే రూల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడ శ్రీదేవి తాజా చిత్రం 'ఇంగ్లీష్‌ - వింగ్లీష్‌'రిలీజ్ అవుతోంది. దాంతో టాక్స్ సమస్యను అధిగమించేందుకు గానూ...తమిళ వెర్షన్ కి ఆంగ్లేయమ్...వాంగ్లేయమ్ అని పెట్టారు. శ్రీదేవి కమ్ బ్యాక్ ఫిలిం కావటంతో తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా అక్కడ మంచి ఓపినింగ్స్ తెస్తుంది అని బావిస్తున్నారు.

    శ్రీదేవి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఇంగ్లీష్-వింగ్లీష్'. గత కొంతకాలంగా ఈ చిత్రంపై అనేక అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా తమిళ కథానాయకుడు అజిత్ కాక బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. దర్శక నిర్మాతలు బాల్కీ-గౌరీషిండే మాట్లాడుతూ శ్రీదేవిపై ఉన్న అభిమానంతోనే అజిత్ ఈ చిత్రంలో నటించడానికి ముందుకొచ్చారని, అలాగే అమితాబ్‌బచ్చన్ ఓ స్పెషల్ రోల్‌లో కనిపించారని, శ్రీదేవి కోసమే ముంబాయి వచ్చి 12 గంటలపాటు షూటింగ్‌లో వుండి, తన పాత్రను పూర్తిచేసి వెళ్లారని తెలిపారు.

    ఆయన వచ్చి వెళ్లాక అందరూ అజిత్ గురించే మాట్లాడుకుని, అభిమానులుగా మారిపోయారని, తెలుగు, తమిళ భాషల్లో అజిత్ అతిథి నటన హైలెట్‌గా వుంటుందని, ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ 5న విడుదల చేయనున్నామని తెలిపారు. ఈ సినిమా గురించి దర్శకురాలు గౌరీ మాట్లాడుతూ 'నా సినిమాకు శ్రీదేవి హీరో. ముందు నేను స్ర్కిప్టు రాసుకున్నప్పుడు ఎవరిని ఎంపిక చేయాలనే విషయం ఆలోచించలేదు. శ్రీదేవి గురించిన ఆలోచనే రాలేదు. ఒక రోజు నా భర్త బాల్కీ బోనీ కపూర్, శ్రీదేవిని కలిసారు. ఈ క్రమంలో నేను కథ తయారు చేసుకున్న విషయం శ్రీదేవి తెలుసుకుని, నా కథ నచ్చి ఆమె చేయడానికి ఒప్పుకుంది' అని వెల్లడించారు.

    ఇక శ్రీదేవి ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాను కలిసారు.'ఇంగ్లీష్‌ - వింగ్లీష్‌'సినిమా గురించి చెపుతూ...దర్శకురాలు గౌరి... 'ఇంగ్లీష్‌ - వింగ్లీష్‌' కథ చెప్పగానే ఒప్పుకొన్నారట కదా...అవును. నా మనసుకి అంతలా నచ్చింది. ఇందులో ఓ సామాన్య గృహిణిలానే కనిపిస్తాను. భాష రాకపోతే.. ఎన్ని సమస్యలొస్తాయి అనే విషయాన్ని వినోదం జోడించి చెప్పారు. నా జీవిత అనుభవాలు కూడా పనికొచ్చాయి. ఎందుకంటే నేను భాష తెలియని చోట కూడా పనిచేశాను. అప్పుడూ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నా అన్నారు. ఆదిల్ హుస్సేన్, ప్రియాఆనంద్, మెహదీ నెబ్బో తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌త్రివేది, కెమెరా: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతిసర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్‌లల్లూ, ఆర్.బాల్కీ, రచన, దర్శకత్వం: గౌరీషిండే.

    English summary
    Films in Tamil need to have a Tamil title in order to get the tax sops announced by the state government. So, the question was about English Vinglish which is made in Tamil and Hindi. It has now been confirmed that the Tamil title for this film will be Aangilam Vaangilam. The expectations on this film are high as it is Sri Devi’s comeback vehicle and also stars Ajith in a cameo!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X