»   » కరికాల చోళుడు... ముంబై, గుజరాత్ చరిత్ర.. "కాలా" కథ చుట్టు ఎన్ని అనుమానాలో

కరికాల చోళుడు... ముంబై, గుజరాత్ చరిత్ర.. "కాలా" కథ చుట్టు ఎన్ని అనుమానాలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

కబాలి తర్వాత రజనీకాంత్, దర్శకుడు పా.రంజిత్ కలయికలో మరో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ ఇతివృత్తంతో రూపొందనున్న ఈ చిత్రానికి కాలా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కరికాలన్ ఉపశీర్షిక. ఇదే రజినీ ఆఖరి సినిమా అని ప్రచారం లో ఉంది . తన రాజకీయ ఎంట్రీ టైమ్ కు కాలా సినిమాను పూర్తిచేసి, పూర్తిస్థాయిలో పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలని రజనీకాంత్ భావిస్తున్నారట. అందుకే తన ఆఖరి సినిమాను అల్లుడు ధనుష్ కు అప్పగించారని సమాచారం.

జీప్ నెంబర్ MH 01 BR 1956

జీప్ నెంబర్ MH 01 BR 1956

'కాలా' ఫస్ట్ లుక్ వచ్చింది. జీపు మీద కూర్చొని డాన్ లా కనిపిస్తున్న రజని ఈ సినిమాలో ఒక మాఫియా లీడర్ పాత్ర చేస్తున్నారని ఇప్పటికే టాక్. అక్కడ కూర్చున్న జీప్ నెంబర్ MH 01 BR 1956 అని ఉంది దాని ద్వారా మనం చాలానే డీకోడ్ చేసుకోవచ్చు. MH అంటే మహారాష్ట్ర అని అర్ధమవుతోంది.


రాజకీయాల పైన

రాజకీయాల పైన

ఇక దేశంలోనే గొప్ప బిజినెస్ రాష్ట్రాలుగా పేరు పొందిన గుజరాత్ మహారాష్ట్ర ఒకప్పుడు కలిసుండేవి. 1956లో అవి చీలిపోయాయి. అదే ఏడాది బి.ఆర్.అంబేద్కర్ కూడా చనిపోయారు. చూస్తుంటే BR.. 1956.. అందుకే చిహ్నాలుగా లేవూ? అందుకే ఈ సినిమా ఖచ్చితంగా అప్పటి రాజకీయాల పైన బిజినెస్ పెత్తందారులు పైన ఏమైనా ఉద్రేకపూరిత సన్నివేశాలతో ఉండొచ్చని ఒక టాక్.


కరికాలన్‌ అంటే

కరికాలన్‌ అంటే

'కాలా' సినిమాకి 'కరికాలన్‌' అనే ట్యాగ్‌లైన్‌ తగిలించారు. కరికాలన్‌ అంటే అర్థం యోధుడు, సమర్థుడు అని. దాంతో, ఇది నూటికి నూరుపాళ్ళూ పొలిటికల్‌ సినిమాయేనని రజనీకాంత్‌ అభిమానులు భావిస్తున్నారు. మరోపక్క, ఈ సినిమా టైటిల్‌ వెనుక రాజకీయ కారణాలేమీ లేవనీ, పవర్‌ఫుల్‌గా వుంటుందనే ఈ టైటిల్‌ పెట్టామని నిర్మాత ధనుష్‌ చెబుతున్నాడు.


పా.రంజిత్‌పై పూర్తిస్థాయి నమ్మకం

పా.రంజిత్‌పై పూర్తిస్థాయి నమ్మకం

ఇదిలా వుంటే, 'కబాలి' సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, పా.రంజిత్‌పై పూర్తిస్థాయి నమ్మకంతో రజనీకాంత్‌, అతనికే ఇంకోసారి అవకాశమివ్వడం, పైగా ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ నిర్మిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. తమిళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌ టైటిల్స్‌ని ఒకేసారి విడుదల చేయడం వెనుక ధనుష్‌ 'మార్కెటింగ్‌' టెక్నిక్‌ అద్భుతహ.. అన్నది తమిళ సినీ వర్గాల్లో విన్పిస్తోన్న వాదన.


తొలి షెడ్యూల్‌ ముంబయిలో

తొలి షెడ్యూల్‌ ముంబయిలో

దర్శకుడు పిఎ రంజిత్ మాట్లాడుతూ... ‘‘ ‘కాలా' అంటే కాలుడు, యముడు అని అర్థం. ‘కరికాలన్‌' అనే టైటిల్‌కు సంక్షిప్త రూపమే ‘కాలా'. చిత్రీకరణ తొలి షెడ్యూల్‌ ముంబయిలో, ఆ తర్వాత చెన్నైలో జరగనుంది. ఈ కథ అభిమానులకు బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది.


అభిమానులను తృప్తి పరిచేలా

అభిమానులను తృప్తి పరిచేలా

చిత్రం టైటిల్‌ చెప్పగానే రజనీకాంత్‌కు బాగా నచ్చింది. చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు. అభిమానులను తృప్తి పరిచేలా ‘కాలా'లో యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయ''అని వివరించారు. ఉంటాయని చెప్పి మరింత ఆసక్తిని పెంచారు. అయితే ఈ సారి మరీ కబాలి రేంజి లో పొగడ్తలు మాత్రం కనిపించలేదు.


జాతీయ పురస్కారాలను పొందిన శ్రీకర్‌ ప్రసాద్‌

జాతీయ పురస్కారాలను పొందిన శ్రీకర్‌ ప్రసాద్‌

చిత్రబృందంలో జాతీయ అవార్డు గ్రహీతలు నలుగురు ఉన్నారు. సినిమా నిర్మిస్తున్న ధనుష్‌ ‘ఆడుకళం'తో నటుడిగా, ‘కాక్కముట్టై', ‘విసారణై' చిత్రాలకు నిర్మాతగా జాతీయ అవార్డులు పొందారు. ‘రాక్‌', ‘ది టెర్రరిస్ట్‌', ‘కణ్ణత్తిల్‌ ముత్తమిట్టాళ్‌' తదితర 7 చిత్రాలకు ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ పురస్కారాలను పొందిన శ్రీకర్‌ ప్రసాద్‌ ఈ చిత్రానికీ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


అంజలి పాటిల్‌

అంజలి పాటిల్‌

‘నా బంగారు తల్లి'కి జాతీయ అవార్డు పొందిన అంజలి పాటిల్‌, ‘విసారణై'కి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు కైవసం చేసుకున్న సముద్రఖని ఇందులో నటించనున్నారు. మరోవైపు ‘కరికాలన్‌' అనేది తమిళ భూమిని పరిపాలించిన చోళరాజుల్లో ఓ రాజు పేరని చరిత్ర చెబుతోంది.


కరికాల చోళుడు

కరికాల చోళుడు

ఆయన జీవిత విశేషాల గురించి పూర్తి వివరాలు లభించనప్పటికీ కాంచీపురం నుంచి కావేరీ పరీవాహక ప్రాంతాల వరకు రాజ్యాన్ని విస్తరించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కరికాల చోళుడు రాళ్లతో నిర్మించిన ‘కల్లణై' (రాతి ఆనకట్ట) జలాశయం నేటికీ చెక్కుచెదరకుండా అలనాటి నిర్మాణ కౌశలానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలవడం గమనార్హం.English summary
Kabali director Pa. Ranjith is directing Rajinikanth in Kaala Karikalan also and his favourite musician Santhosh Narayanan is composing for the film which is being made in Tamil, Hindi and Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu