»   » మహేష్ సరే..మరి మూడో ఈడియట్ ఏడి?

మహేష్ సరే..మరి మూడో ఈడియట్ ఏడి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు తాజాగా త్రీ ఇడియట్స్ చిత్రం రీమేక్ కి సైన్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో అమీర్ ఖాన్ పాత్రకు మహేష్ బాబుని, తమిళంకు విజయ్ ని ఎంపిక చేసారు. అలాగే రెండు వెర్షన్ ల లోనూ హీరోయిన్ గా ఇలియానా, బొమన్ ఇరానీ చేసిన ప్రొఫెసర్ పాత్రకు గానూ సత్యరాజ్ ని ఎంపిక చేసారు. ఇక రీసెంట్ గా రెండో ఇడియట్ గా నిర్మాత ఆర్.బి.చౌదరి కుమారుడు జీవాని ఎంపిక చేసారు. హ్యారీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. అయితే మూడో ఈడియట్ గా ఎవరు నటిస్తారనేది మాత్రం ఇంకా తేలలేదు. తమిళ హీరో ఆర్య ఆ లిస్టు లో ఉన్నప్పటికీ అతనికి ా పాత్ర పెద్దదవుతుందంటున్నారు. ఇక మాదవన్ చేసిన పాత్రను అతన్నే అడిగినా డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని చేతులెత్తేసాడు. ఫైనల్ గా సిద్దార్ధపై అందరి కన్నూ ఉంది. బావ ప్లాప్ లో మునిగి తేలుతున్న సిద్దార్ధ రెమ్యునేషన్ బాగా ఎక్కువ చెప్పటంతో నిర్మాతలు కన్ఫూజన్ లో పడ్డారుట. శంకర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా స్క్రిప్టు పనిలో మునిగి తేలుతున్నాడని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu