»   » ఐఫా ఉత్సవం: తమిళ ‘బాహుబలి’కి అవార్డుల పంట!

ఐఫా ఉత్సవం: తమిళ ‘బాహుబలి’కి అవార్డుల పంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఐఫా(ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌) ఉత్సవం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభం అయింది. రెండు రోజులు జరగనున్న ఈ వేడుకలో మొదటిరోజులో భాగంగా తమిళ, మలయాళ కళాకారులకు అవార్డులను అందజేశారు.

ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌ దంపతుల నుంచి పలువురు తారలు, సాంకేతిక నిపుణులు ‘ఐఫా' పురస్కారాన్ని అందుకున్నారు. తొలి రోజు వేడుకలో బాహుబలి తమిళ వెర్షన్ కు ఎక్కువ అవార్డులు వచ్చాయి.


WHOA! Baahubali Win Laurels At IIFA Utsavam

మొత్తం 12 విభాగాల్లోగాను.... ఈ చిత్రానికి మొత్తం 6 విభాగాల్లో అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజమౌళి ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకున్నారు. ఈ చిత్రంలో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ ఉత్తమ సహాయ నటుడిగా, శివగామి పాత్రలో నటించిన రమ్యక్రిష్ణ ఉత్తమ సహాయ నటిగా అవార్డు దక్కించుకుంది. దీంతో పాటు ఈ చిత్రానికి పాటలు పడిన హరిచరణ్ శేషాద్రి ఉత్తమ నేపథ్య గాయకుడిగా, గీతా మాధురి ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డులు అందుకున్నారు.


కె.బాలచందర్‌, టి.ఇ.వాసుదేవన్‌, ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ లకు లెజండరీ అవార్డులను ప్రకటించగా వారి వారసులు వాటిని అందుకున్నారు. అదాశర్మ బోణీకపూర్‌, శివరాజ్‌కుమార్‌, రసూల్‌ పోకుట్టి, సాయిధరమ్‌ తేజ్‌, జీవా, మీనా, రమ్యకృష్ణ, శ్రియ, తమన్నా, తాప్సీ, రెజీనా, లావణ్య త్రిపాఠీ, ప్రియమణి, పారుల్‌ యాదవ్‌, అదాశర్మ, సంజన, నిరోష తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

English summary
S.S Rajamouli's magnum opus Baahubali bagged the best film award at the first edition of IIFA Utsavam on Day 1. The two-day event honoured the best talent across Tamil and Malayalam film industries late on Sunday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu