»   » మీడియాపై ఇళయారాజా ఫైర్..రజనీకాంత్ ని సైతం

మీడియాపై ఇళయారాజా ఫైర్..రజనీకాంత్ ని సైతం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళనాడులో లేటెస్ట్ సంచలనం బీప్‌సాంగ్‌. ఈ సాంగ్ .. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో అన్ని రకాలుగానూ సమస్యలను తెచ్చిపెడుతోంది. రీసెంట్ గా ఇళయరాజాను సైతం ఇరుకున పడేసింది. దాంతో ఆ వివాదం ..రజనీకాంత్ వైపు టర్న్ తీసుకుంది.

ఇటీవల వరద బాధితుల కోసం తనవంతుగా సహకరించిన వారిని సంగీత దర్శకుడు ఇళయరాజా అభినందించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం అనంతరం ఇళయరాజా వెళ్తుండగా.. ఆయన్ను ‘బీప్‌సాంగ్‌ గురించి మీ అభిప్రాయం ఏంటి?' అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీంతో ఆయన చాలా సీరియస్ అయ్యారు ఆ రిపోర్టర్ పై.

అంతేకాకుండా నన్ను ఆ ప్రశ్న అడగటానికి నీకు ఏ అర్హత ఉందన్నట్టుగా నిలదీశారు. ఇళయరాజా మాటలతో పలువురు మీడియా వ్యక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాగా ఆయన అడిగిన ప్రశ్నలో తప్పేముందంటూ మిగిలిన మీడియా వారు అనుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని పాత్రికేయ సంఘాలు, ఇళయరాజా మధ్య చిన్నపాటి సమస్య కూడా కొనసాగుతోంది.

Why don’t you ask Rajinikanth about Beep Song?

ఇదిలా ఉండగా ఇళయరాజా సోదరుడు గంగైఅమరన్‌ దీనిపై ఫేస్ బుక్, ట్విట్టర్ లో స్పందించారు. ‘ఇళయరాజా వంటి సంగీత పెద్దలతో వేటి గురించి అభిప్రాయాలు అడగాలనే విషయం తెలిసి ఉండాలి. వాస్తవానికి ఆయన స్వరాలు సమకూర్చిన పాటలనే ఆయన మళ్లీ విన్న సందర్భాలను నేనెప్పుడూ చూడలేదు.

అలాంటిది బీప్‌ పాట గురించి ఆయన్ను ప్రశ్నించడం నాకు నచ్చలేదు. అంతెందుకు రజనీసార్‌కు బంధువేగా అనిరుధ్‌?.. ఆయన్ను అడగండి?.. ఏం తమిళ్‌, తమిళ్‌ అంటూ ప్రాణాలు కూడా వదిలేస్తానంటున్నారే ఆ వ్యక్తి తండ్రి టీఆర్‌.. ఆయన్ను అడగండి. ఉన్నత స్థాయికి ఎదిగిన వారి హృదయాన్ని ఆవేదనకు గురిచేయకండ''అని అందులో ఆయన పేర్కొన్నారు.

English summary
Gangai Amaren has come out in support of his brother and asked why no one has questioned Superstar Rajinikanth or even veteran actor-director T Rajendhar about the Beep song.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu