»   » మణిరత్నం మూవీ నుంచి ప్రముఖ హీరో అవుట్.. కారణం అదేనట..

మణిరత్నం మూవీ నుంచి ప్రముఖ హీరో అవుట్.. కారణం అదేనట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశంలోనే గర్వించదగిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన రూపొందించే చిత్రంలో నటించే అవకాశం వస్తే ఎవరైనా ముందు వెనుకా ఆలోచించరు. తాజాగా మణిరత్నం రూపొందిస్తున్న ఓ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, శింబు, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, అధితిరావు హైదరీ నటిస్తున్నారు. అయితే నటుడు ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం మణిరత్నం చిత్రం నుంచి తప్పుకోవడం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అందుకు కారణం ఇదే అని వినిపిస్తున్నది.

 చెలియా అట్టర్ ఫ్లాప్

చెలియా అట్టర్ ఫ్లాప్

కార్తీ, అదితిరావు హైదరీతో రూపొందించిన చెలియా ఘోర పరాజయం తర్వాత మరో చిత్రంపై మణిరత్నం దృష్టిపెట్టారు. భారీస్థాయిలో నటీనటులను, ప్రతిభావంతులైన టెక్నిషియన్స్‌ను ఎంచుకొని సిద్ధమవుతున్నారు.

ఫహాద్ ఫాజిల్ అవుట్

ఫహాద్ ఫాజిల్ అవుట్

తన చిత్రంలోని కీలకపాత్ర కోసం మలయాళ నటుడు ఫహద్‌ను మణిరత్నం తీసుకొన్నారు. కానీ అనూహ్యమైన రీతిలో ఆయన సినిమా నుంచి తప్పుకోవడం వెనుక స్పష్టమైన కారణాలు వెల్లడి కాలేదు.

 డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే

డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే

ఫహద్ సినిమా నుంచి వైదొలగడం వెనుక అసలు కారణం డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మణిరత్నం సినిమా షూటింగ్ సమయంలోనే మరో చిత్రానికి డేట్స్ కేటాయించాల్సి రావడం సమస్యగా మారింది. దాంతో ఏదో ఒక చిత్రాన్ని ఎంపిక చేసుకోమని ఇచ్చిన సలహా మేరకే ఫహాద్ తప్పుకొన్నట్టు సమాచారం.

రెహ్మన్ సంగీతం, శివన్ కెమెరా

రెహ్మన్ సంగీతం, శివన్ కెమెరా

మణిరత్నం చిత్రం ఫిబ్రవరి చివరి వారంలో గానీ, మార్చి మొదటివారంలో గానీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

English summary
Mani Ratnam is busy giving final touches to his upcoming yet untitled bilingual multi-starrer, which was confirmed to star Fahadh Faasil, Vijay Sethupathi, Simbu, Jyothika, Aishwarya Rajesh and Aditi Rao Hydari in the lead. The industry grapevine is that Fahadh has opted out of the project and the Roja director is busy finalising his replacement. While the exact reason for Fahadh’s exit is yet unknown, sources close to Ratnam have hinted that he chose to take the decision due to his prior commitments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu