»   »  వడ్డీలే ఎక్కువయ్యాయి..కమల్ వదిలేసాడు

వడ్డీలే ఎక్కువయ్యాయి..కమల్ వదిలేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం-2' రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తైనా విడుదల కావటం లేదు. ఈ సంవత్సరం కూడా విడుదల అయ్యేటట్లు కనపడటంలేదని చెన్నై సినీ వర్గాల సమాచారం.

అయితే ఇలా విడుదల ఆలస్యం కావటానికి కారణం నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అని తేల్చి చెప్పిన కమల్ హాసన్ తను కూడా ఏమీ ఉత్సాహం చూపుతున్నట్లు లేడు. కమల్ ముందుకు వస్తే రిలీజ్ ఎప్పుడో అయ్యిపోయేదని అంటున్నారు. అయితే కమల్ కూడా ఈ చిత్రం విషయంలో ఎందుకో తాత్పార్యం చేస్తున్నారు.

Why Kamal Haasan's Vishwaroopam 2 delay?

అయితే ఈ సినిమాని బయిటకు తేవాలంటే పాతిక కోట్లు దాకా కావాలి. వడ్డీలే చాలా అయ్యాయి. అందుకే కమల్ ..వదిలేసాడని అని చెప్తున్నారు మరికొందరు. విశ్వరూపం సినిమా వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఇప్పుడు ఈ సినిమాపై క్రేజ్ కూడా పెద్దగా లేదు. కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు.

అలాగే...ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలు అనుకున్న విధంగా రాలేదట. దాంతో కమల్‌హాసన్ అసంతృప్తిగా ఉన్నారని భోగట్టా. ఈ సన్నివేశాలను రీషూట్ చేయాలని ఆయన అనుకుంటున్నారట. ఇవన్నీ జరిగే పనులు కావని చెప్పుతున్నారు.

Why Kamal Haasan's Vishwaroopam 2 delay?


విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్‌ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది.

English summary
Though Vishwaroopam II is ready for release, it is learnt that Ravichandran is not keen on releasing it .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu