Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్టార్ హీరోపై మండిపడుతున్న దర్శకుడు గౌతం మీనన్
నేను కేవలం ఇద్దరి హీరోల కోసమే వెయిట్ చేస్తాను. వాళ్ళు మరెవరో కాదు..కమల్ హాసన్ సార్ మరియు నా బెస్ట్ ప్రెండ్ సూర్య కోసం మాత్రమే అని తేల్చి చెప్పేసారు ప్రముఖ దర్శకుడు గౌతం మీనన్. ఆయన తాజాగా అజిత్ తో చెయ్యాల్సిన ప్రాజెక్టు కాన్సిల్ చేసారు. దానికి కారణం మీడియావారు అడగ్గా..అజిత్ వచ్చే సంవత్సరం దాకా ఆగమన్నాడు. నాకు వేరే హీరో కోసం ఆగేంత అవసరం, టైమ్ రెండూ లేవు. అయినా అజిత్ అందరి దర్శకుల కథలు విని చివరకు డైరక్టర్ వెంకట్ ప్రభు(సరోజ దర్శకుడు) తో సినిమా చేసుకుంటున్నాడు. అయినా నేను ఏమి మాయ చేసావే హిందీ వెర్షన్ డైరక్ట్ చేయాలి.
సెప్టెంబర్ మొదటి వారం ఆ షూటింగ్ ప్రారంభమవుతుంది. అలాగే రాణా తో సినిమా కూడా వెంటనే ప్రారంభించాలి. మరో ప్రక్క నా ప్రొడక్షన్ లో రెండు సినిమాలు నిర్మాణం జరుగుతున్నాయి. వాటిని పర్యవేక్షించుకోవాలి..నేనూ బిజీనే అన్నారు. అజిత్ డేట్స్ ఇవ్వలేదని కోపాన్ని ఇలా గౌతమ్ మీనన్ మీడియా ముందు వెళ్ళగక్కారు. ఇక గౌతం మీనన్, నాగార్జున కాంబినేషన్ లో ఓ చిత్రం ఓకే అయిన సంగతి తెలిసిందే. అలాగే గౌతం మనన్..ప్రస్తుతం సమీరా రెడ్డితో నడినుసి నియగల్ అనే ధ్రిల్లర్ చేస్తున్నారు. అందులో సమీరా రెడ్డి సెక్స్ వర్కర్ గా చేస్తోంది. ఓ రాత్రి జరిగే కథ ఇదని, ఓ కొత్త వ్యక్తితో ఓ వేశ్య కి జరిగే అనుభావాల సమాహారమేనని ఈ చిత్రం కధ గురించి చెప్తున్నారు.