»   » ఆలూ లేదూ చూలూ లేదు బాహుబలిని కొట్టేస్తున్నాం అన్నారు, సంఘమిత్ర అసలు సంగతి ఇదట

ఆలూ లేదూ చూలూ లేదు బాహుబలిని కొట్టేస్తున్నాం అన్నారు, సంఘమిత్ర అసలు సంగతి ఇదట

Posted By:
Subscribe to Filmibeat Telugu

సడన్‌గా సంఘమిత్ర చిత్రం నుంచి శృతిని తప్పిస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఆమెతో ప్రొఫెషనల్‌ ఇబ్బందులు తలెత్తాయని నిర్మాతలు ఆరోపిస్తే, అసలు వారి దగ్గర కథే లేదని, ఎప్పుడు మొదలవుతుందో తెలియని సినిమాకి రెండేళ్లు డేట్స్‌ ఎలా కేటాయిస్తానని శృతిహాసన్‌ అడిగింది.''దురదృష్టవశాత్తూ 'సంఘమిత్ర' నుంచి శ్రుతి తప్పుకున్నారు. అన్నారు గానీ ఆ దురదృష్టవశాత్తు వెనక పెద్ద కథే ఉంది మరి.... గుండె రాయి చేసుకొని చదవండీ.

సుందర్ భీబత్సమైన ట్రాక్ రికార్ద్

సుందర్ భీబత్సమైన ట్రాక్ రికార్ద్

బాహుబలిని మించి పోయే సినిమా 459 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నాం అనగానే దర్శకుడు సుందర్ సీ వైపు అంతా అనుమానంగానే చూసారు. ఇప్పటివరకూ సుందర్ భీబత్సమైన ట్రాక్ రికార్ద్ మీద నమ్మకం కూడా ఎక్కువే కావటం తో అయనమీద నమ్మకం తో సూర్య, విజయ్ లాంటి స్టార్ లు ముందే మాకు కుదరదంటూ పక్కకు తప్పుకున్నారు.

కేన్స్ ఫెస్టివల్‌లో టీజర్‌

కేన్స్ ఫెస్టివల్‌లో టీజర్‌

పాపం మరీ అంత క్రేజ్ తెచ్చుకోకుండా మీడియం స్టేజ్ లోనే పదేళ్ళనుంచీ సాగుతున్న ఆర్యా, జయం రవి లని తీసుకుంటున్నాం అనగానే మళ్ళీఇ ఒకసారి గుర్రం మెగిరే సామెతనే తల్చుకున్నారు... అయితే కేన్స్ లో చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే కేన్స్ ఫెస్టివల్‌లో టీజర్‌తో అదరగొడితే ఏదో అద్భుతమే జరుగనుందని అందరూ భావించారు.

తమిళ పత్రికలైతే

తమిళ పత్రికలైతే

ఇక తమిళ పత్రికలైతే బాహుబలి రికార్డులన్నీ ఇప్పుడే తుడిచి పెట్టుకుపోయాయ్ అన్నంత ఉత్సాహంగా కథలు.., కథలు రాసాయ్.. భారతీయ చిత్రపరిశ్రమ చారిత్రక ఇతివృత్తాలవైపు మళ్లడం ఆశాజనకమని అందరూ పొగిడేశాయ్. అసలు సినిమా రేంజ్ చూడండీ అంటూ అసలు ఆర్టిస్టులకు మేకప్ కూడా వెయ్యకుండానే గ్రాఫిక్స్ తో వీరాధి వీరుల పోస్టర్లు వెయించి హంగామా చేసారు, ఓడలూ గుర్రాలూ, అంతా రిచ్చ్ గానే ఉందీ అనిపించేలా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.

ఏం చూసి రెండేళ్ళు డేట్లివ్వాలి

ఏం చూసి రెండేళ్ళు డేట్లివ్వాలి

కానీ ఇంత మెగా ప్రాజెక్టు నుంచి ఆ చిత్ర కథానాయిక శ్రుతి హసన్ అర్థాంతరంగా తప్పుకున్నట్లు వార్తలు రావడం షాక్ ఇస్తే, బయటకి రావటానికి వెనక ఉన్న కారణం వినగానే అందరికీ బుర్ర తిరిగి పోయింది. అసలక్కడ కథే లేదు ఏం చూసి రెండేళ్ళు డేట్లివ్వాలి అని శృతి అన్న మాటకి కోలీవుడ్ గుండె లయ తప్పింది...

ఏప్రిల్‌ నుంచి శిక్షణ

ఏప్రిల్‌ నుంచి శిక్షణ

రెండేళ్ల పాటు కొనసాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి తన శిక్షణ, సమగ్రమైన స్క్రిప్టు, సరైన డేట్‌ కేలండర్‌ ముఖ్యమని ఆమెకు తెలుసు. అందుకే ఈ సినిమా చేయడానికి అంగీకరించి, ఉత్తమ ద్వంద్వ యుద్ధ శిక్షకుడి వద్ద ఏప్రిల్‌ నుంచి శిక్షణ పొందుతున్నారు. ఆ విధంగా షూటింగ్‌కు సిద్ధమయ్యారు.

సమగ్రమైన బౌండ్‌ స్క్రిప్ట్

సమగ్రమైన బౌండ్‌ స్క్రిప్ట్

అయితే ఈ సినిమా చేయడానికి ఆమె ఎంత ఉద్వేగంతో ఎదురుచూస్తున్నా, ఇప్పటికీ సమగ్రమైన బౌండ్‌ స్క్రిప్ట్ తన చేతికి రాకపోవడం వల్లా, సరైన డేట్‌ కేలండర్‌ అందకపోవడం వల్లా తప్పనిసరి పరిస్థితుల్లో ‘సంఘమిత్ర' ప్రాజెక్టు నుంచి శ్రుతి తప్పుకుంటున్నారు.

బెహెన్ హోగి తేరి

బెహెన్ హోగి తేరి

ప్రస్తుతం ఆమె హిందీ చిత్రం ‘బెహెన్ హోగి తేరి' ప్రమోషన్ లో పాల్గొంటున్నారు. అలాగే ‘శభా్‌షనాయుడు' సినిమా ప్రిపరేషన్సలో ఉన్నారు'' అని ఆ ప్రతినిథి వివరించారు. అయితే ఈ వ్యవహారం మొత్తం పెద్ద డ్రామాని తలపిస్తోందనే కామెంట్స్‌ పడుతున్నాయి.

450 కోట్ల బ‌డ్జెట్ తో

450 కోట్ల బ‌డ్జెట్ తో

దాదాపు 450 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాల‌ని సుంద‌ర్ సి భావించాడు. ఆర్య‌, జ‌యం ర‌వి, శృతి హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌నున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్స్ రీసెంట్ గా కేన్స్ లో విడుద‌ల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో శృతి యువరాణిగా నటించనుండగా, ఆ పాత్ర కోసం కొన్నాళ్ళ నుండి కసరత్తులు చేస్తుంది శృతి.

పెద్ద అనుమానమే వస్తోంది

పెద్ద అనుమానమే వస్తోంది

ఆ క‌స‌ర‌త్తులకి సంబంధించిన వీడియోల‌ని కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం సంఘ‌మిత్ర చిత్రం నుండి శృతి త‌ప్పుకుంద‌ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ థెండాళ్ ఫిలింస్ ప్ర‌క‌టించింది. అయితే ఈ మొత్తం వ్యవహారం లో అసలు స్క్రిప్టే రెడీ అవలేదంటూ శృతీహసన్ చెప్పటం,మొదటినుంచీ కూడా పెద్ద హీరోలెవరూ ఈ ప్రాజెక్ట్ కి నో చెప్పటం వంటివన్నీ చూస్తే పెద్ద అనుమానమే వస్తోంది.

అసలు స్క్రిప్ట్ రెడీ అవకుండానే

అసలు స్క్రిప్ట్ రెడీ అవకుండానే

అసలింతకుముందు నిరాకరించిన హీరోలు కూడా డేట్లు ఇవ్వకపోవటానికి అసలు దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవటమే నన్న టాక్ మొదలయ్యింది. అసలు స్క్రిప్ట్ రెడీ అవకుండానే "బాలుబలిని" కొట్టే సినిమా అంటూ పెద్ద డ్రామా ఆడారంటూ కోలీవుడ్ జనాలే నవ్వుకుంటున్నారు.

కేన్స్‌లో అనౌన్స్‌ చేయగానే

కేన్స్‌లో అనౌన్స్‌ చేయగానే

భారీ బడ్జెట్ తో ఫలానా సినిమా తీస్తున్నామంటూ కేన్స్‌లో అనౌన్స్‌ చేయగానే పెద్ద స్టూడియోలు వచ్చి తమతో భాగస్వామ్యం తీసుకుంటాయని, తద్వారా వచ్చే పెట్టుబడులతో భారీ చిత్రాన్ని మొదలు పెట్టవచ్చునని నిర్మాతలు భావించారని, అందుకే శృతిహాసన్‌కి అడ్వాన్స్‌ ఇచ్చి ఆమెతో సందడి చేయించారని,

అద్బుతమైన ఫ్లాప్ లు ఇచ్చేసిన సుందర్‌ .సి

అద్బుతమైన ఫ్లాప్ లు ఇచ్చేసిన సుందర్‌ .సి

తీరా ఇప్పటి వరకూ కనీసం 40-50 కోట్ల బడ్జెట్ దగ్గరకు కూడా వెళ్ళకుండానే అద్బుతమైన ఫ్లాప్ లు ఇచ్చేసిన సుందర్‌ .సి సినిమా అనేసరికి ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ ముందుకి కదలలేదని అంటున్నారు. అంత హంగామా చేసి ఇంతవరకు కనీసం కథ కూడా రాసుకోకపోవడం చూస్తే,

గౌరవం కాపాడుకోవాలంటే

గౌరవం కాపాడుకోవాలంటే

ఇంతవరకు ముప్పయ్‌ కోట్ల బడ్జెట్‌ వున్న సినిమా తీయని సుందర్‌తో నాలుగు వందల కోట్ల సినిమా అనడాన్ని వింటే ఇదంతా అసలు ఊరికే మొదలు పెట్టిన నాటకం అంటూ కొట్టిపడేస్తున్నారు. ఈ ఆరోపణలు తప్పించుకుని గౌరవం కాపాడుకోవాలంటే శృతి స్థానంలో మరొకరిని తీసుకుని త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకి తీసుకెళ్లాలి. లేదంటే.. బాహుబలి తో పోలికలు పెట్టుకోకుండా మామూలుగా తాను హ్యాడిల్ చేసే రేంజ్ సినిమా తీసుకోవాలి చూద్దాం మరి సుందర్ ఏం చేస్తాడో..

English summary
Shruti Haasan, who recently made an appearance at Cannes representing Sundar C's film Sanghamithra as the female lead, has backed out from the project. The 31-year-old actress was supposed to portray the role of a warrior princess in the film
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu