»   » హా...మళ్లీనా? : తల పట్టుకుంటున్న రజనీ ఫ్యాన్స్

హా...మళ్లీనా? : తల పట్టుకుంటున్న రజనీ ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమా 'కోచ్చడయాన్‌'. దీపిక పదుకొనె హీరోయిన్ . ఆది పినిశెట్టి ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. రజనీకాంత్‌ తనయురాలు సౌందర్య ఆర్‌.అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో విక్రమ్ సింహా టైటిల్ తో రిలీజ్ అవుతోంది. తెలుగు వెర్షన్ ని లక్ష్మి గణపతి ఫిలింస్‌ పతాకంపై బి.సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌లో తెరపైకి తీసుకొస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. అదే నెలలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో విడుదల వాయిదా వేసే అవకాశాలు కూడా లేకపోలేదని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దాంతో రజనీకాంత్ ఫ్యాన్స్ మరో వాయిదానా అని తలపట్టుకుంటున్నారు. తమ బాస్ చిత్రం చూసి చాలా కాలం అయ్యిందని, తమ వెయిటింగ్ ని నిర్మాతలు అర్దం చేసుకోవాలని అంటున్నారు.

సూపర్‌స్టార్‌ నటించిన 'కోచ్చడయాన్‌'కు 'యూ' ధ్రువపత్రం దక్కింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ నటించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దీపికా పదుకొనే కథానాయిక. శరత్‌కుమార్‌, శోభన, ఆది తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఇటీవలే ఆడియో విడుదల వేడుకను కూడా జరుపుకుంది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని తిలకించిన సెన్సార్‌ బోర్డు సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడతగిన చిత్రమని కితాబిస్తూ 'యూ' ధ్రువపత్రం అందజేశారు.

 Will Kochadaiiyaan's release be postponed due to general elections? -

తమిళ్‌, హిందీ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శోభన, శరత్‌కుమార్‌, జాకీ ష్రాప్‌, నాజర్‌ ..ఇలా భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ విభిన్న అవతారంలో కనిపించే పోస్టర్లు ఇప్పటికే అభిమానులు సహా ప్రేక్షకుల్లో వైబ్రేషన్‌ క్రియేట్‌ చేశాయి.

'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు.


'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

English summary
The release date of Superstar Rajinikanth's most-anticipated Kochadaiyaan was originally stated April, this year. But April 11 also happens to be bang in the middle of India’s general elections, which stretch from April 7 to May 12. With the nation’s attention focussed on what seems like a mighty important poll.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu