»   »  శంకర్ 'రొబొ' టైటిల్ మారింది!!

శంకర్ 'రొబొ' టైటిల్ మారింది!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajinikanth
తమిళ ప్రజలకు ఉన్న భాషాభిమానం తెలియంది కాదు. ప్రస్తతం శంకర్ దర్శకత్వంలో భారీగా తయారవనున్న రొబొ చిత్రానికి టైటిల్ రొబొ అన్నది ఆంగ్లనామము అవటంతో వారు నిరశన వ్యక్తం చేస్తున్నారు. అది పెరిగి పెద్దదవకమునపే త్రుంచాలని తమిళంలో ఈ చిత్రానికి Yanthiran అనే పేరు పెట్టారు.- The Robot అనేది కాప్షన్ గా ఉంచనున్నారు. ఇక ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిన్న అనగా వినాయక చవితి రోజున ఎ.వి.యమ్ .స్టూడియోలో గుట్టుగా జరిపారని అంతర్గత వర్గాల సమాచారం. అలాగే ఈ చిత్రం షూటింగ్ బ్రెజిల్ లో జరగునుందని ఇప్పటికే యూనిట్ సభ్యులు అక్కడకు చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఇక రజనీ,శంకర్ ఇవాళ,రేపటిలో బయిలదేరనున్నారు. అలాగే కొద్దిరోజుల అనంతరం హీరోయిన్ ఐశ్వర్యారాయి అక్కడకి లాంచ్ అవనుంది. దాదాపు 40 రోజుల పాటు లాటిన్ అమెరికా,బ్రెజిల్ దేశాల్లో ఈ షూటింగ్ నిర్విఘ్నంగా జరగునుంది. ఇంతకీ తెలుగులో ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ కి ఏం టైటిల్ పెట్టనున్నారనేది ఆసక్తికర విషయం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X