»   » ఫుల్ గా మందుకొట్టే నటించాడట...రివీల్ చేసేసాడు

ఫుల్ గా మందుకొట్టే నటించాడట...రివీల్ చేసేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సాధారణంగా తాగుడు సీన్స్ ఉంటే ...తాగినట్లు కనిపించటానికి ప్రాక్టీస్ చేస్తారు కానీ తాగేసి నటించారు. కాని తాను మాత్రం తాగే నటించాను అంటున్నాడు విజయ్ ఆంటోని. అంతలా విషయం రివీల్ చేసే వాళ్లు అరుదు. ఎవరేమనుకున్నా ఫర్వాలేదనుకున్నాడో ఏమో నిజం బయిటపెట్టేసాడు.

విజయ్ ఆంటోని మాట్లాడుతూ...నిజం చెప్పాలంటే తాను సలీమ్ చిత్రంలో మందు పాటలో నటించాను. అందుకు నిజంగానే మద్యం సేవించి నటించాను అని అన్నారు.

Yes, I got drunk for it!: Vijay Antony

నటుడు శ్రీకాంత్ హీరోగా నటించి, నిర్మించిన నంబియార్ చిత్రానికి విజయ్ ఆంటోని సంగీతాన్ని అందించాడు. నటి సునైనా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రస్తుతం హీరోగా హిట్ మీద హిట్ కొడుతున్న నటుడు సంతానం హాస్య పాత్రలో నటించడం ప్రస్తావనార్హం. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నంబియార్ చిత్రానికి సంగీతం అందించడంతో పాట ఒక పాటలో చిన్నగా చిందులేసిన విజయ్‌ఆంటోనితో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

విజయ్ ఆంటోని మాట్లాడుతూ...ఆ పాత్రను ఆయన మాత్రమే చేయగలరు.సంతానం పాత్ర నంబియార్ చిత్రానికి చాలా సపోర్టుగా నిలుస్తుంది. ఆయన చిత్రాల్లో పాడాలన్న ప్రయత్నాన్ని చేయలేదు. ఈ చిత్రంలో సంతానంతో ఒక పాట పాడించాం. శ్రీకాంత్‌తో ఉన్న స్నేహం కారణంగానే ఆయన ఇందులో పాడారు. మద్యం తాగి ఆడి పాడే ఐటమ్ గీతం అది. సంతానం నిజంగా మందు తాగినట్లే నటించారు. చాలా రియలిస్టిక్‌గా నటించారు. వెరైటీగా ఉంటుందని పాటకు కాస్త స్లో బాణీలు కట్టాను అన్నారు.

English summary
Vijay Antony recalls his experience doing a similar song for 'Dr.Salim'. 'For the booze song in 'Dr.Salim', I got drunk to get everything right.,' shares the Actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu