»   » విడాకులపై స్పందించిన రజనీకాంత్ కూతురు!

విడాకులపై స్పందించిన రజనీకాంత్ కూతురు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య వివాహం చెన్నైకి చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త అశ్విన్ కుమార్‌తో ఆరేళ్ల క్రితం ఎంతో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా సౌందర్య కాపురం గురించి ఓ షాకింగ్ న్యూస్ రెండు మూడు రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు జాతీయ మీడియాలో సైతం వార్తలొచ్చాయి.

ఈ వార్తలపై సౌందర్య స్పందించారు. భర్త నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సౌందర్య స్పష్టం చేసారు. జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ.... విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్న మాట వాస్తవమే అన్నారు.

ప్రస్తుతం విడాకుల ప్రక్రియ జరుగుతోందని, ఇకపై తన కొడుకే తనకు సర్వస్వమని అశ్విన్ తెలిపారు. ఇది చాలా సున్నితమైన విషయమని, ఈ విషయాన్ని రచ్చ చేయవద్దని, అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

విడాకుల కారణంపై

విడాకుల కారణంపై

అయితే విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏమిటనే దానిపై స్పందించడానికి ఆమె నిరాకరించారు. ప్రస్తుతం సౌందర్య తన సినిమా రంగంలోనే తన కెరీర్ ఎంచుకుంది. త్వరలో తన తండ్రి జీవితంపై సినిమా తీయబోతోంది.

కొడుకే సర్వస్వం

విడాకుల వార్త మీడియాలో హల్ చల్ అయిన కొన్ని గంటల్లోనే సౌందర్య ఓ ట్వీట్ చేసారు. ఇకపై తన జీవిత సర్వస్వం తన కొడుకు వేద్ కృష్ణ అంటూ ఆ ట్వీట్ ఉద్దేశ్యం

వీళ్లే నా బలం

ఈ రోజు సౌందర్య 31వ జన్మదినం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన సినిమా టీం గురించి ఓ ట్వీట్ చేసారు. వీళ్లు మా అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇదే నా టీం... వీళ్లే నా బలం అంటూ సౌందర్య ట్వీట్ చేసారు.

ఐశ్వర్య, సౌందర్య కలిసి

ఐశ్వర్య, సౌందర్య కలిసి

రజనీకాంత్ ఇద్దరు కూతుళ్లకు ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. ఈ ఇద్దరు కలిసి తన తండ్రి జీవితాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నారు.

భర్త ప్రస్తుతం అమెరికాలో

భర్త ప్రస్తుతం అమెరికాలో

అశ్విన్ ఇపుడు యూఎస్ఏ లో ఉన్నారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటున్నట్లు టాక్. ఆయన తిరిగి రాగానే ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో విడాకులు పొందుతారని తెలుస్తోంది. సౌందర్య పెళ్లి జరిగిన ఆరేళ్లలోనే పెటాకులు కావడం రజనీ అభిమానులను బాధిస్తోంది.

English summary
Rajinikanth's younger daughter, Soundarya, has announced that she has decided to end her marriage with Chennai-based industrialist, Ashwin Ramkumar. "Yes, it is true that Ashwin and I have been separated for over a year now, and that divorce talks are on. Hope everyone will understand the sensitivity of this topic, and respect our privacy." she said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu