తలో 5 లక్షలూ విరాళం ఇచ్చారు
చెన్నై : తమిళనాడులో వరద బాధితుల కోసం చిత్రపరిశ్రమకు చెందిన మరికొందరు నటులు విరాళాలు అందజేశారు. ఇప్పటికే నటుడు సూర్య తన కుటుంబం తరఫున రూ.25 లక్షల చెక్‌ను నటీనటుల సంఘానికి అందజేసిన విషయం తెలిసిందే.

నటుడు ధనుష్, విశాల్‌లు కూడా తమవంతుగా సాయపడ్డారు. వర్ధమాన నటుడు శివకార్తికేయన్ కూడా ఈ సేవలో పాలుపంచుకున్నారు. రూ.5 లక్షల చెక్‌ను నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్‌కు సోమవారం అందజేశారు.

శివాజిగణేశన్ కుటుంబం తరఫున నటుడు విక్రంప్రభు రూ.5 లక్షల చెక్‌ను నాజర్, సంఘం నిర్వాహకులకదిచ్చారు. ఇక నటుడు, సత్యరాజ్, ఆయన కుమారుడు శిబిరాజ్‌లు కలసి రూ.2.25 లక్షలు సహాయనిధికి అందజేశారు. ఈ నగదును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనున్నట్లు నటుడు నాజర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











