»   » బూతు పాట తీసేయలేమని తేల్చి చెప్పిన యూట్యూబ్

బూతు పాట తీసేయలేమని తేల్చి చెప్పిన యూట్యూబ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : శింబు బీప్ సాంగ్ వివాదం తమిళనాడునే ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పాటను యూ ట్యూబ్ నుంచి తొలగించాలని పోలిసులు ఆ సంస్థ నిర్వాహకులను కోరారు. కాని వారు నిరాకరించడంతో సమస్య పెద్దదిగా మారింది.

Youtube Refuses to remove Beep Song

11వ తేదీ నుంచి యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్ లలో హల్‌చల్ చేసిన ఈ పాటకు ఇప్పటికే 10 లక్షల మంది లైక్ చేశారు. దీంతో శింబు బీప్ పాటకు సంబంధించిన వివాదానికి త్వరగా పుల్‌స్టాప్ పెట్టాలని భావించిన పోలిసులు ఆ సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో పోలీసులు యూట్యూబ్ అధికారులను కలిసి శింబు సాంగ్‌ను నిలిపివేయాల్సిందిగా కోరారు. అయితే ఆ పాట అర్థం ఏమిటో మాకు అనువాదం చేసి చెప్పాల్సిందిగా యూట్యూబ్ నిర్వాహకులు పోలీసులను అడిగారు.

Youtube Refuses to remove Beep Song

అతి కష్టం మీద బీప్ సాంగ్‌ను పోలీసులు మార్చి చెప్పగా అందులో పెద్దగా తప్పు పట్టాల్సిన విషయం ఏమీ లేదని తేల్చి చెప్పారు యూట్యూబ్ నిర్వాహకులు. దీంతో కంగు తిన్న పోలీసులు అసలు ఈ పాట యూట్యూబ్‌లోకి ఎలా వచ్చింది? దీనికి కారకులెవరు?అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇంతకీ ఇంత సంచలనం రేపిన ఆ సాంగ్ ఏంటి అంటే ఇదిగో ..ఇది...

అరెస్ట్ కు భయపడి శింబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అనిరుధ్‌ సంగీత దర్శకత్వంలో శింబు పాడిన ‘బీప్‌ సాంగ్‌' ప్రస్తుతం తమిళనాడులో పెద్ద సంచలనమైంది. మహిళలను కించపరిచే రీతిలో అసభ్య పదజాలంతో తమిళ సినీ నటుడు శింబు పాడిన బీప్ సాంగ్ వివాదం రాజు కుంది. మహిళా సంఘాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కోయంబత్తూరు రేస్ కోర్సు పోలీసులు కేసు నమోదు చేసి, సమన్లు జారీ చేశారు. ఈ విషయం వెల్లడైనప్పటి నుంచి నటుడు శింబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

మహిళలను కించపరిచే రీతిలో పాట పాడిన శింబు, అనిరుధ్‌లను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత ప్రజాస్వామ్య మహిళా సంఘం, ప్రజాస్వామ్య యువత సంఘం తరపున సేలం జిల్లా కలెక్టర్‌ కార్యాయం ఎదుట ఆందోళన చేపట్టారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు శింబు, అనిరుధ్‌ల చిత్రపటాలను దగ్ధం చేసేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. తర్వాత ఆందోళన కారులు శింబు, అనిరుధ్‌ల చిత్రపటాలను చింపేసి నిరసన తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా పాటను రూపొందించిన వారిపై బెయిలుకు వీల్లేని కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

English summary
Youtube officials do not find any valid reason to remove the song. A senior police official reported that Youtube is not willing to take the song off of the channel and is claiming for the meaning to those words.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu