For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్‌బాస్‌కు బాబు లాంటి షో.. ఐలాండ్‌లో ఒంటరిగా సెలబ్రిటీలు.. శ్రీరెడ్డితో వనిత విజయ్‌కుమార్ తలపడితే?

  |

  రియాలిటీ షో ఫార్మాట్ ఎప్పటికిప్పుడు కాలానికి తగ్గట్టుగా అప్డేట్ అవుతుంది. ఒకసారి ఏదైనా షో మొదలయ్యింది అంటే మరొక ఛానల్ అంతకుమించి అనేలా మరొక రియాల్టీ షోను మొదలుపెడుతుంది. ఇక ప్రస్తుతం అందరికీ కూడా బిగ్ బాస్ రియాల్టీ షో మాత్రమే తెలుసు. కానీ అంతకుమించి అనేలా మొదటి సారి ఇండియాలో రియాల్టీ షో మొదలు కాబోతోంది. బిగ్ బాస్ లో అయితే ఒక ఇంట్లో ఉంచి మనుషులతో పోటాపోటీగా ఉండేలా వదులుతారు. కానీ ఈ సారి సర్వే ద్వారా జీ తమిళ్ ఛానల్ ఒక పెద్ద రియాల్టీ షోను పెట్టబోతోంది. కంటెస్టెంట్స్ ను దీవులలో వదిలేయడం ఈ షోలో స్పెషల్ ఎట్రాక్షన్.

  అర్జున్ సర్జా హోస్ట్ గా

  అర్జున్ సర్జా హోస్ట్ గా


  ప్రపంచంలోనే అతి పెద్ద రియాలిటీ షో అయినటువంటి ‘సర్వైవర్' ప్రారంభిస్తున్నట్లు జీ తమిళ్ ప్రకటించిన్నప్పటి నుంచి సౌత్ ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ హీరో అర్జున్ సర్జా హోస్ట్ గా వ్యవహరించబోతున్న ఈ షో కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురచూస్తున్నారు. సౌత్ ఇండియన్ టెలివిజన్ ఎంటర్‌టైన్‌మెంట్ చరిత్రలో మొదటిసారిగా ప్రసారం కావడానికి అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేస్తున్నారు. ఇక కంటేస్తెంట్స్ విషయంలో కూడా నిర్వాహకులు ఏ మాత్రం తగ్గకుండా బలమైన వారిని రంగంలోకి దింపుతున్నారు.

  జాంజీబార్ దీవులలో..

  జాంజీబార్ దీవులలో..

  ఈ రియాలిటీ - కమ్-డ్రామా షోను ఆఫ్రికన్ తీరంలోని అద్భుతమైన జాంజీబార్ దీవులలో కొనసాగుతుంది. భారీ ప్రైజ్ మనీ కోసం అక్కడే కంటెస్టెంట్స్ నెలల పాటు గడపాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం పోటీదారులను సిద్ధం చేస్తున్నారు. వారందరు కూడా ప్రకృతి శక్తులకు వ్యతిరేకంగా మనుగడ సాగించాల్సి ఉంటుంది. నటుడు శివ కార్తికేయన్ ద్వారా సర్వైవర్ యొక్క ఫస్ట్ లుక్ ట్రైలర్ ను గత నెలలోనే రిలీజ్ చేశారు.

  శ్రీ రెడ్డి vs వనితా విజయ్ కుమార్

  శ్రీ రెడ్డి vs వనితా విజయ్ కుమార్


  నటుడు ఆర్య కూడా సర్వైవర్ ప్రోమోను కూడా రిలీజ్ చేశాడు. ఇక జనావాసాలు లేని ద్వీపంలో మనుగడ సాగించే వైఖరితో సెలబ్రెటీలు ఎలాంటి టాస్క్ లను ఎదుర్కొంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి సోషల్ మిడియాలో వైరల్ గా మారింది. ఇక అందులో కాంట్రవర్సీలతో బాగా క్రేజ్ అందుకున్న శ్రీ రెడ్డి, వనితా విజయ్ కుమార్ కూడా ఉన్నారు. వీరిద్దరు కూడా ఫైర్ బ్రాండ్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

   కంటెస్టెంట్ లిస్ట్ లీక్

  కంటెస్టెంట్ లిస్ట్ లీక్

  ఇక శ్రీ రెడ్డి, వనితా ఇద్దరు పోటీ పడితే వాతావరణం ఎలా ఉంటుందా అని ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మిగతా పోటీ దారుల విషయానికి వస్తే.. విక్రాంత్, విజయలక్ష్మీ, నందా, అనికా, ఇంద్రజ, జాన్ విజయ్, గోపీనాథ్, శలు శము, బెసంత్ రవి, VJ పార్వతి, శరన్ శక్తి, గాయత్రి రెడ్డి, విద్యుల్లేఖ, నారాయణ్, సృష్టి, ఇనిగో ప్రభారన్ వంటి వారి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.

  మొదలెయ్యేది ఎప్పుడంటే..

  మొదలెయ్యేది ఎప్పుడంటే..


  ఇప్పటివరకు ఇలాంటి రియాలిటీ షో అయితే ఇండియాలో రాలేదు. ఒక ఐలాండ్ లో సెలబ్రెటీలను వదిలేసి రియాలిటీ షోగా మలచడం అంటే భారీ రిస్క్ తో కూడుకున్న అంశం. విభిన్నంగా టాస్క్ లను ఇచ్చి భారీగా రేటింగ్స్ అందుకోవాలని చూస్తున్నారు. ఇక జీ తమిళ్ టెలివిజన్ స్క్రీన్‌లలోకి సెప్టెంబర్ 12 నుండి ప్రతిరోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. మరి ఈ షో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

  English summary
  ZEE TAMIZH’s Survivor Tamil Contestants list viral sri reddy Vanitha Vijaykumar,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X