For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లాస్య ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం ఇదే: అభిజీత్, హారిక లేకుంటే ఆమె సేవ్ అయ్యేదే

  |

  తెలుగు బుల్లితెరపై గ్లామరస్ బ్యూటీల హవా నడుస్తోన్న సమయంలో.. హోమ్లీగా ఉంటూ ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది ప్రముఖ యాంకర్ లాస్య. ఒకప్పుడు వరుస షోలతో పాటు సినీ తారలతో ముచ్చట్లు, సినిమా ఫంక్షన్లతో బిజీ బిజీగా గడిపిన ఆమె.. వివాహం తర్వాత పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. బయట ఉన్న ఫాలోయింగ్ ప్రకారం లాస్య టైటిల్ ఫేవరేట్ అని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమె షో నుంచి ఎలిమినేట్ అయింది. తాజాగా దీనికి గల కారణాలు బయటకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే....

   రీఎంట్రీలో యూట్యూబ్‌కే పరిమితమైంది

  రీఎంట్రీలో యూట్యూబ్‌కే పరిమితమైంది

  కెరీర్ ఆరంభంలో వరుసగా షోలు చేస్తూ బిజీ బిజీగా గడిపింది లాస్య. ఈ క్రమంలోనే తెలుగులో సుమ తర్వాత అతంటి పేరున్న యాంకర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. అలాంటిది ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఆమె సుదీర్ఘంగా బ్రేక్ తీసుకుంది. అయితే, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భర్త సహకారంతో యూట్యూబ్‌లో పలు రకాల వీడియోలు అప్‌లోడ్ చేస్తోంది.

   బిగ్ బాస్‌ షోలోకి ఎంట్రీతో ఫ్యాన్స్ ఖుషీ

  బిగ్ బాస్‌ షోలోకి ఎంట్రీతో ఫ్యాన్స్ ఖుషీ

  చాలా కాలం పాటు బుల్లితెరపై కనిపించకపోవడంతో లాస్య మంజునాథ్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏడాదిన్నర బాబును తన భర్త దగ్గర వదిలేసి షోలోకి అడుగు పెట్టిందామె. ఇక, ఈ సీజన్‌లో పేరున్న కంటెస్టెంట్లలో ఒకరైన ఈ సీనియర్ యాంకర్.. ఫైనల్స్ వరకూ ఉంటుందని అంతా అనుకున్నారు.

  వంటలక్క పేరు.. అదే మైనస్ అయింది

  వంటలక్క పేరు.. అదే మైనస్ అయింది

  బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టిన తర్వాత లాస్య వంటలక్కగా పేరు సంపాదించుకుంది. ప్రతి రోజూ హౌస్‌లోని అందరికీ వండి పెడుతుండేది. ఈ క్రమంలోనే పలుమార్లు కెప్టెన్సీ బాధ్యతతో పాటు రేషన్ మేనేజర్‌గానూ ఎంపికైంది. అయితే, ఇది వంటలక్క పేరు ఆమెకు ప్రతికూలంగానూ మారింది. ఎప్పుడూ వంటగదికే పరిమితమై టాస్కులు ఆడదన్న చెడ్డ పేరు కూడా మూటగట్టుకుంది.

   టైటిల్ ఫేవరేట్... ఫైనల్‌కు రాకుండానే

  టైటిల్ ఫేవరేట్... ఫైనల్‌కు రాకుండానే

  ఈ సీజన్‌లో బరిలోకి దిగిన కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరేట్‌గా పేరొందింది లాస్య మంజునాథ్. కానీ, ఊహించని విధంగా ఆమె 11వ వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. వాస్తవానికి ఎన్నో సార్లు నామినేట్ అయిన ఈ సీనియర్ యాంకర్.. ప్రేక్షకుల ఆదరణతో సేవ్ అవుతూ వచ్చింది. అయితే, ఈ వారం మాత్రం ఆమెకు తక్కువ ఓట్లు పోలవడంతో బయటకు వెళ్లాల్సి వచ్చింది.

  లాస్య ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమిదే

  లాస్య ఎలిమినేషన్‌కు ప్రధాన కారణమిదే


  భారీ స్థాయిలో పాపులారిటీ ఉన్న లాస్య షో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఎన్నో వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే దీని వెనకున్న ప్రధాన కారణం బయటకు వచ్చింది. బుల్లితెర వర్గాల్లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. అఖిల్ సార్థక్ ఫ్యాన్స్ మోనాల్‌కు సపోర్ట్ చేయడం వల్ల ఆమెకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని, అది లాస్యకు ప్రతికూలంగా మారిందని తెలిసింది.

  అభిజీత్, హారిక లేకుంటే ఆమె సేవ్ అయ్యేదే

  అభిజీత్, హారిక లేకుంటే ఆమె సేవ్ అయ్యేదే

  ఇదే నామినేషన్‌లో అభిజీత్, హారిక కూడా ఉన్నారు. ఒకవేళ వాళ్లిద్దరిలో ఒకరు జాబితాలో లేకుంటే వాళ్ల ఫ్యాన్స్ లాస్యకు మద్దతిచ్చేవారు. ఇప్పుడు వాళ్లిద్దరూ లిస్టులో ఉండడం వల్ల ఎవరి ఫ్యాన్స్ వాళ్లకే ఓట్ చేశారు. ఇది కూడా లాస్యకు తక్కువ ఓట్లు పడడానికి ఓ కారణంగా భావిస్తున్నారు విశ్లేషకులు. అలాగే, ఆరియానాకు అవినాష్ ఫ్యాన్స్ సపోర్ట్ చేశారని కూడా ఓ టాక్ వినిపిస్తోంది.

  English summary
  Lasya is an Indian television actress and movie actress who predominanly works in Telugu TV and Cinemas. There was speculation that Lasya would be a contestant in Big Boss Season 3 Telugu. Recently, Lasya married to Manjunath.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X