హోస్ట్‌గా నువ్వొద్దు.. స్టార్ యాంకర్‌ను తిప్పికొట్టిన ప్రేక్షకులు.. గొడవకు దిగిన శ్రీముఖి
తన అందం, చలాకీతనంతో టాప్ యాంకర్‌గా దూసుకెళ్తున్నారు శ్రీముఖి. తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాప్ రేంజ్‌లో ఉన్నారు. ఏ ఛానెల్‌లో చూసినా ఈమె షో ఉండాల్సిందే. స్టార్ యాంకర్ సుమ కనకాల సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ఏవో ఒకటి రెండు షోలు చేసుకుంటుండగా తెలుగు టెలివిజన్‌లో శ్రీముఖిదే హవా. ఇప్పట్లో ఆమె దరిదాపుల్లోకి వచ్చేవాళ్లు ఎవరూ లేరు. అలాంటి శ్రీముఖి ప్లేస్‌పై కన్నేసింది ఓ ముద్దుగుమ్మ. ఈ వివరాల్లోకి వెళితే..
యాంకర్‌గా దూసుకెళ్తోన్న శ్రీముఖి
స్టార్ మాలో ప్రేక్షకులను అలరించేందుకు సీరియల్స్‌తో పాటు రకరకాల కార్యక్రమాలు టెలికాస్ట్ అవుతున్నాయి. వీటితో ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు సెపరేట్ క్రేజ్ ఉంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న పలు సీరియల్స్‌లో నటించే నటీనటులతో పాటు ఇతర బుల్లితెర సెలబ్రెటీలను ఒకచోటికి తీసుకొచ్చి వారితో ఆడిపాడిస్తుంది శ్రీముఖి. ఈ కార్యక్రమానికి ఆమె ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ప్రతి వారం కొత్తగా ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఈ షోను హోస్ట్ చేస్తున్నారు శ్రీముఖి

కార్తీక పౌర్ణమికి ముస్తాబు
ప్రతి వారం ఏదో ఒక పండుగ, స్పెషాలిటీ, లేదా స్పెషల్ థీమ్‌తో కార్యక్రమాన్ని డిజైన్ చేస్తుంటారు నిర్వాహకులు. దీనిలో భాగంగా కార్తీక మాసం అందులో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆదివారం కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ విడుదల చేసింది. పండుగ కావడంతో నటీనటులంతా సాంప్రదాయబద్ధంగా ముస్తాబై వచ్చారు. ఈ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడున్న వారంతా వారి మనసులోని కోరికలను ప్రేక్షకులతో పంచుకోవాలని అవి నెరవేరుతాయో లేదో వారే డిసైడ్ చేస్తారని అంటుంది శ్రీముఖి
బావతో రావాలని అనుకుంటున్నా
తొలుత ప్రోమో స్టార్టింగ్‌లోనే శ్రీముఖి వచ్చి బాంబు పేల్చింది. నెక్ట్స్ కార్తీక పౌర్ణమికి నేను బావగారితో పాటు ఎపిసోడ్‌కి రావాలని కోరుకుంటున్నానని ఏమంటారు? అని ప్రేక్షకులను అడగ్గా.. దానికి గ్యాలరీలో కూర్చొన్న ప్రేక్షకులు యస్ అనే బోర్డ్ పైకెత్తారు. దాంతో ఆమె పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లేనని, అందుకే అలాంటి కోరిక కోరుకున్నదని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి తన మనసుకు నచ్చిన వ్యక్తిని శ్రీముఖి సెలెక్ట్ చేసుకుందో లేదో చూడాలి.
ఆ ప్లేస్ నాకు కావాల్సిందే
ఆ వెంటనే బిగ్‌బాస్ కంటెస్టెంట్, మరో యాంకర్ సిరి హనుమంతు అందమైన చీరలో రెడీ అయి వచ్చింది. ఈ షోకి అందరూ మారుతున్నారు కానీ, యాంకర్ మాత్రం మారడం లేదని.. ఆ ప్లేస్‌లో నేనుండాలని కోరుకుంటున్నాను అని శ్రీముఖి ప్లేస్‌కి ఎసరు పెట్టింది. సిరి నుంచి శ్రీముఖి షాకైంది. తన కోరిక గురించి మీరు ఏమనుకుంటున్నారని సిరి అడగ్గా... ప్రేక్షకులు మాత్రం మరో ఆలోచన లేకుండా ఈ షోకు శ్రీముఖియే యాంకర్‌గా కొనసాగాలని తేల్చేశారు. సిరి హనుమంతు కోరికకు నో అనే బోర్డ్ ఎత్తేయ్యగా.. సిరి షాకైంది. అయితే అందరూ నో అనే బోర్డ్స్ పట్టుకుంటే ఓ బుడ్డోడు బోర్డ్ యస్ అనే బోర్డ్ పట్టుకోవడంతో శ్రీముఖి కోపంతో ఊగిపోయింది.
గొడవకు దిగిన శ్రీముఖి
నువ్వు యస్ అన్నావా అంటూ స్టేజ్ నుంచి కిందకి దిగి గ్యాలరీలో ఉన్న పిల్లాడి దగ్గరికి వెళ్లింది. దాంతో యాదమ్మ రాజు వచ్చి పాపం వాడికి యస్‌కి, నోకి తేడా తెలియదని క్షమించి వదిలేయమని అంటాడు. ఇంతలో సిరి హనుమంతు మాత్రం క్యూటీ అంటూ ఆ బుడ్డోడి బుగ్గపై ముద్దు పెట్టడంతో అందరూ ఈలలు, కేకలతో గోల చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











