twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టెలివిజన్‌ షో కి అమీర్‌ఖాన్‌కు ఐసీఎన్సీ అవార్డు

    By Srikanya
    |

    వాషింగ్టన్‌: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌ అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఆన్‌ నాన్‌వైలంట్‌ కాన్‌ఫ్లిక్ట్‌ (ఐసీఎన్‌సీ) అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన నిర్వహిస్తున్న టెలివిజన్‌ షో 'సత్యమేవ జయతే'ని పరిగణనలోకి తీసుకొని ఐసీఎన్‌సీ అమీర్‌కు ఈ అవార్డు ప్రకటించింది. అక్టోబరు 28న వాషింగ్టన్‌ డీసీలో జరిగే అమెరికా అబోర్డ్‌ మీడియా (ఏఏఎం) విందులో ఈయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

    సత్యమేవ జయతే కార్యక్రమం భారత్‌లోని అతిపెద్ద సామాజిక సవాళ్లను తెరపైకి తెస్తున్నట్లు ఏఏఎం పేర్కొంది. ఇటీవల టైమ్‌ మ్యాగజీన్‌ 100 అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో అమీర్‌ను చేర్చింది. సత్యమేవ జయతే పేరుతో బుల్లి తెరపైకి తొలిసారి అడుగుపెట్టిన అమీర్‌ ఖాన్‌ తన తొలి ప్రయత్నంలోనే అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. ఆయన నిర్వహిస్తున్న సత్యమేవ జయతేకు మేధావులు, చలన చిత్ర రంగానికి చెందిన తోటి నటులే కాక అశేష ప్రజానీకం అభినందిస్తున్నది. బాలికల లైంగిక వేధింపుల సమస్యను తీసుకుని ఆయన నిర్వహించిన కార్యక్రమం చాలా విజ్ఞానదాయకంగా వుంది.

    బాలికల లైంగిక వేధింపులు, వాటిని పెద్దలకు ఎలా నివేదించాలి? లైంగిక వేధింపులను గుర్తించడమెలా? పిల్లలపై లైంగిక వేధింపులను నివారించేందుకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అత్యంత హృద్యంగా ప్రజలకు తెలియజేశారు. ఇది చూశాక మన ఇంట్లో మన పిల్లలతో సంబంధాలు ఎలా ఉండాలో ఒక స్పష్టత వచ్చింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయా రంగాల్లోని నిపుణులతోను, బాధితులతోను, వారి తల్లిదండ్రుల తోను, నివేదికలు, గణాంకాలు, గ్రాఫిక్స్‌తో ఎంతో క్లిష్టమైన సమస్యను చాలా సులువుగా అందరికీ అర్థమయ్యేలా వివరించడం ఈ కార్యక్రమంలోని మరో ప్రత్యేకత.

    ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు స్టార్‌ టివి, ఇతర ప్రాంతీయ భాషా చానెళ్లలో డబ్బింగ్‌లో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం టెలివిజన్‌ చానెళ్ల కార్యక్రమాలకే మణిపూస వంటిది. సామాజిక స్పృహతో కూడిన ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని రావాలని కోరుకుందాం. అమీర్ ఖాన్ కు అవార్డ్ వచ్చిన సందర్భంగా ధట్స్ తెలుగు శుభాకాంభలు తెలుపుతోంది.

    English summary
    Bollywood superstar Aamir Khan has been selected for a US award for his television show Satyamev Jayate along with eminent American director Kathryn Bigelow and the International Center on Nonviolent Conflict (ICNC).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X