'సీఐడీ' టీవీ సీరియల్ లో సినీ సూపర్ స్టార్

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోలు టీవీ సీరియల్స్ ని తమ చిత్రాల ప్రమేషన్ కు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. గతంలో రౌడీ రాథోడ్ చిత్రం ప్రమోషన్ కోసం అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా ..సిఐడీ సీరియల్ లో కనిపించారు. తన సినిమాకు ప్రమోషన్ తో పాటు సీరియల్ కూ ప్రమేట్ చేయటం కలిసి వస్తుంది. అంతకుముందు దబాంగ్ సినిమా ప్రమేషన్ లో భాగంగా..సల్మాన్ ఖాన్...కలర్స్ ఛానెల్ లో ప్రసారమయ్యే లాగి తుజ్ సే లగాన్ అనే టీవీ సీరియల్ లో కనిపించారు.
ఇక సీఐడి సీరియల్ లో సైతం సల్మాన్ ఖాన్ గతంలో కనిపించారు. ఆ సీరియల్ లో వాంటెడ్, బాడీగార్డ్ చిత్రాలు పైరసీ కి అయ్యాయని,సీఐడీ టీమ్ ధర్యాప్తు చేస్తూంటే తాను వచ్చి సహకరిస్తాడు. అలా పైరసీ నిరధోంలో పబ్లిసిటీకి ఈ సీరియల్ ని వాడుకున్నారు. ఇలా టీవీ సీరియల్స్ ద్వారా బాలీవుడ్ హీరోలు కనిపించి తమ సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ సీరియల్ చూసే ప్రేక్షకులని సైతం ఆనందపరుస్తున్నారు. టీవీల్లో మునిగిపోయే ప్రేక్షకులను ఆకర్షించటానికి కూడా ఇదో మార్గం అంటున్నారు.
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ వారు నడిపిస్తున్న సీరియల్ 'సీఐడీ'. మొదట్లో వారాంతాల్లో ప్రసారం అయ్యే ధారావాహికగా ప్రారంభమైన సీఐడీ క్రమంగా దినసరికి మారింది. ప్రస్తుతం తెలుగులోకి కూడా డబ్బింగ్ అయ్యి మా టీవీలో ప్రసారం అవుతోంది. అసలు ఈ కార్యక్రమ రూపకర్తలు మొదట దూరదర్శన్ నేషనల్‌లో 1986లోనే ఈ సీరియల్ ప్రారంభించారు. తర్వాత కొన్ని రోజులకు సీఐడీ సోనీ టీవీకి మారింది. 2000 సంవత్సరం నుంచి సోనీ టీవీలో అవిశ్రాంతంగా పరిశోధన కొనసాగిస్తోంది ఈ సీఐడీ టీమ్.


Click it and Unblock the Notifications











