అమీర్ ఖాన్ షోలో పాల్గొన్నందుకే హత్య చేసారా?

By Bojja Kumar

ముంబై : ఓ వైపు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెంది అన్నిరంగాల్లో సరికొత్త విజ్ఞానంతో ముందుకు సాగుతుంటే...మరో వైపు భారత్ లాంటి దేశాల్లో మారుమూల ప్రాంతాల్లో వెనకబాటుతనం ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మూఢ నమ్మకాలు, కులం పంచాయితీలు లాంటిని ఇంకా అమలులో ఉన్నాయి.

ఇలాంటి వాటిపై చైతన్యం కల్పించడంతో పాటు, దేశంలోని కొన్ని ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా చేపట్టి కార్యక్రమం 'సత్యమేవ జయతే'. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా ప్రసారమైన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చిన పలు అంశాలపై ప్లార్లమెంటు కూడా స్పందించిందంటే విషయం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా....'సత్యమేవ జయతే' కార్యక్రమానికి అభిమానులుగా ఉన్న వారికి ఓ బ్యాడ్ న్యూస్. 'సత్యమేవ జయతే' కార్యక్రమం ద్వారా కాప్ పంచాయతీ(కుల పంచాయితీ)లకు వ్యతిరేకంగా గళం విప్పిన అబ్దుల్ హకీం అనే వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా తుపాకితో కాల్చి హత్య చేసారు. గర్భవతి అయిన తన భార్యకు డాక్టర్ వద్ద నుంచి మందులు తీసుకెలుతుండగా... ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాప్ పంచాయితీల వ్యవహారాలపై వ్యతిరేక గళం విప్పినందుకే అతన్ని హత్య చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయమై అమీర్ ఖాన్ స్పందిస్తూ...'ఈ సంఘటన సత్యమేవ జయతే టీంను ఎంతో బాధించిందని, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకుని రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు' తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X