Don't Miss!
- News
రాజ్ భవన్లో ఎట్ హోంకు చంద్రబాబు, పవన్ డుమ్మా-జగన్ తోనే సరిపెట్టిన గవర్నర్ !
- Finance
d-sib: సురక్షిత బ్యాంకు కోసం చూస్తున్నారా.. RBI సూచించింది ఇదే..
- Sports
INDvsNZ : ఇదేంట్రా అయ్యా?.. ఇన్ని గాయాలా?.. యువ ఓపెనర్‌పై సెలెక్టర్లు సీరియస్!
- Lifestyle
Chanakya Niti: ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
మరిచిపోయే పనులు చేశావా? అంతా నీ గురించే.. సోహెల్‌ను ఆడుకున్న అభిజిత్
బిగ్ బాస్ షో నాల్గో సీజన్ నడిచినంత కాలం, ఆ షో ముగిసిన తరువాత కూడా సోహెల్ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాడు. 25 లక్షలు తీసుకుని ఫినాలే రేసు నుంచి తప్పించుకోవడం, ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశసంలు దక్కించుకోవడం, చివరకు మెహబూబ్ హింట్ ఇచ్చిన వీడియో వైరల్అవ్వడం ఇలా ప్రతీ ఒక్క విషయంలో సోహెల్ వైరల్ అవుతూనే వస్తున్నాడు.

లైవ్‌లో క్లారిటీ..
మెహబూబ్ హింట్ ఇచ్చాడన్న ఆరోపణలపై సోహెల్ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చాడు. మొదటిసారిగా తన ఇన్ స్టా లైవ్ సెషన్‌లో నోరు విప్పాడు. మెహబూబ్ హింట్ ఇవ్వలేదని, తన కెరీర్ మీద ఒట్టేసి చెబుతున్నా అంటూ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చాడు. కానీ ఆరోపణలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

అభిజిత్ ఫ్యాన్స్ ఫైర్..
సోహెల్ మెహబూబ్ అభిజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా అభిజిత్ ఫ్యాన్స్ సోహెల్ మీద ఫైర్ అవుతున్నారు. అయితే సోహెల్ మాత్రం తనకు ఇలాంటి ఫ్యాన్స్ వార్ నచ్చదని, అర్థం చేసుకోండని కోరాడు. అప్పటి నుంచి అభిజిత్ తనకు ఎలాంటి గొడవలు, విబేధాలు లేవని చెప్పేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు.

ప్రాంక్ కాల్..
మెహబూబ్ తన యూట్యూబ్ చానెల్‌లో సోహెల్‌ను ఇంటర్వ్యూ చేశాడు. అందులో అభిజిత్‌తో సోహెల్ ప్రాంక్ కాల్ చేసి ఆట పట్టించాడు. మూవీ ఆఫర్ అంటూ చెప్పి అభిజిత్‌ను బుక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అభిజిత్ మాత్రం నమ్మినట్టే నమ్మాడు కానీ చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు. వివరాలన్నీ మెయిల్ చేయండంటూ సోహెల్‌కు కౌంటర్ వేశాడు.

మరిచిపోయావా?
ప్రాంక్ కాల్ అనంతరం అభిజిత్ తాను సోహెల్ అని చెప్పుకొచ్చాడు. మరిచిపోయావా? అని సోహెల్ అభిజిత్‌ను ప్రశ్నించాడు. నిన్ను మరిచిపోతానా? మరిచిపోయే పనులు చేశావా? అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారని పరోక్షంగా మెహబూబ్ హింట్ వీడియో గురించి మాట్లాడినట్టు కనిపిస్తోంది.

నీ క్రేజ్‌కు ఫిదా..
నీ క్రేజ్ చూసి, ఫాలోయింగ్ చూసి ఫిదా అయ్యానంటూ మెహబూబ్, సోహెల్‌లు అభిజిత్ గురించిచెప్పుకొచ్చాడు. నీ సక్సెస్‌కు తామెంతో ఆనందిస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని మరోసారి అందరికీ క్లారిటీ ఇచ్చారు.