అభిజిత్ అట్టర్ ఫ్లాప్.. మోనాల్ గజ్జర్ కంటే దారుణంగా.. !

బిగ్‌బాస్ ఇంటిలో రోబో టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యులందరూ హడావిడి చేశారు. కుర్చీపై కూర్చొని ఓపికగా ఎక్కువ సమయంగా కదలకుండా ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకుండా ఉండాలి. కానీ అభిజిత్‌ను ఈ విషయంలో హారిక, సోహెల్ మోనాల్ ఆటపట్టించారు. ఈ గేమ్‌లో ఏం జరిగిందంటే..

కుర్చీలో కూర్చోగానే అభిజిత్

కుర్చీలో కూర్చోగానే అభిజిత్

టాస్క్ బజర్ మోగగానే అభిజిత్‌ను దేత్తడి హారిక కూర్చొబెట్టింది. కూర్చోగానే కదలడంతో అందరూ అభిజిత్‌ను పాయింట్ అవుట్ అయ్యారు. కుర్చిలో కూర్చోగానే ఎలా కదలుతావ్ అంటూ పాయింట్లు వేయమని అఖిల్‌కు సూచించారు. అయితే నేను ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదంటూ అఖిల్‌కు అభిజిత్ సముదాయించాడు.

 అభిజిత్ ఏకాగ్రతను భంగం చేసేందుకు

అభిజిత్ ఏకాగ్రతను భంగం చేసేందుకు

ఇక బజర్ మోగిన తర్వాత కుర్చీలో కూర్చొని ఉంటే గేమ్ స్టార్ట్ అయినట్టే అంటూ మోనల్, హారిక, సోహెల్ వాదించారు. అయితే అలాంటి గేమ్స్ నా వద్ద సంకేతం ఇచ్చారు. కుర్చీలో కూర్చొన్న తర్వాత ఇంటి సభ్యులు చేసిన అల్లరికి చాలా డిస్ట్రబ్ అయ్యాడు. అభిజిత్ ఏకాగ్రతను భంగం చేసేందుకు అందరూ చిలిపి పనులు చేశారు. మాటలతో కవ్వించారు. అభిజిత్ ముఖంపై బొట్టు పెట్టి హారిక ఆటపట్టించింది.

అభిజిత్‌ను ఆటపట్టించిన హారిక, సోహెల్

అభిజిత్‌ను ఆటపట్టించిన హారిక, సోహెల్

అభిజిత్‌ ఏకాగ్రతను భంగం చేయడానికి ప్రధానంగా హారిక, సోహెల్ శతవిధాలా ప్రయత్నించారు. దాంతో పలుసార్లు నవ్వడం, కనుబొమ్మలు కదిలించడం లాంటివి చేయడంతో అఖిల్ పాయింట్స్ నోట్ చేసుకొన్నాడు. అలా అభిజిత్‌ను ఏడిపిస్తూ అతడి ఏకాగ్రతను భంగం చేయడంలో పూర్తిగా ఇంటి సభ్యులు సఫలమయ్యారు.

ఎక్కువ ఓపికతో సోహెల్ తక్కువ పాయింట్లు

ఎక్కువ ఓపికతో సోహెల్ తక్కువ పాయింట్లు

ఏకాగ్రతను భంగం చేసే టాస్క్‌లో సోహెల్‌కు 0, అరియానాకు 4 పాయింట్లు, హారికకు 4 పాయింట్లు, మోనాల్‌కు 10 పాయింట్లు, అభిజిత్‌కు 27 పాయింట్లు వచ్చాయి. దాంతో ఎక్కువసార్లు ఏకాగ్రతను పోగొట్టుకొన్న కంటెస్టెంట్‌గా అభిజిత్ నమోదయ్యాడు. ఆ తర్వాత తనను డిస్ట్రబ్ చేసిన హారికను వెంటాడి కొట్టేందుకు అభిజిత్ ప్రయత్నించాడు.

Recommended Video

Chiranjeevi Helps His Fan Financially For His Daughter's Wedding
గోల్డెన్ మౌత్ పీస్‌లో సోహెల్ ప్రేక్షకుల ముందుకు

గోల్డెన్ మౌత్ పీస్‌లో సోహెల్ ప్రేక్షకుల ముందుకు

ఏకాగ్రత టాస్క్‌లో విజేతగా నిలిచిన వ్యక్తి పేరు చెప్పమని బిగ్‌బాస్ సూచించాడు. దాంతో అఖిల్ తన మార్కు చేసుకొన్న పాయింట్ల ఆధారంగా విజేతను ప్రకటించాడు. ఎక్కువ ఓపికగా తక్కువ పాయింట్లు సోహెల్ సాధించాడు. కాబట్టి సోహెల్ విజేతగా నిలిచినట్టు ప్రకటించాడు. ఆ తర్వాత బంగారు మౌత్ పీస్‌తో ప్రేక్షకులకు ఓటింగ్ చేయమని చెప్పే కార్యక్రమాన్ని చేపట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X