»   »  ఉదయభాను ఓవర్ యాక్షన్ తగ్గించాలంటున్నారు

ఉదయభాను ఓవర్ యాక్షన్ తగ్గించాలంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ ఉదయ్ భాను ప్రస్తుతం పొలిటీషియన్స్ ని నిలదీయమంటూ టీవీ 9 ఛానెల్ కు ఓ పోగ్రాం చేస్తోంది. ఆ పోగ్రాం పేరు నిగ్గదీసి అడుగు. ఈ పోగ్రాం ద్వారా ఆమె రాజకీయనాయుకులపై అవగాహన పెంచనుంది. తెలంగాణా, ఆంధ్రా,రాయలసీమ ఎక్కడైనా ప్రజలే బాధితులు...మాట తప్పే నాయకులను సహించవద్దు...మీ కష్టాలను నాతో చెప్పండంటూ ముందుకు వస్తోంది. ఈ పోగ్రాం నిమిత్తం ఆమె సామాన్యులను కలుస్తోంది. అందుకోసం ఆమె టూర్ వేస్తోంది. అయితే అంతా బాగానే ఉన్నా పోగ్రాంలో మరీ నాటకీయత పాలు ఎక్కువైపోతోందని, ఉదయభాను ఓవర్ యాక్షన్ లా మరిందని విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి.

మంచి పోగ్రామ్ ని ఉదయభాను ఇలా నీరుకారుస్తోందని అంటున్నారు. అలాగే కార్యక్రమం కాన్సెప్టు వైజ్ గా బాగున్నప్పటికీ ఆoమె కొంచెం డ్రామా తగ్గిస్తే ఎబ్బెట్టుగా ఉండటం తగ్గుతుందంటున్నారు. ముఖ్యంగా కొన్ని పడిగట్టుపదాలు...అన్యాయం, అక్రమం, నిర్లక్ష్యం,నిరాదరణ వంటి వాటి వాడకం తగ్గించాలని అంటున్నారు. దానికి తోడు ఆమె క్రింద స్ధాయిలో ప్రజా సమస్యలను అవగాహన చేసుకుని వెళ్తే నవ్వులు పాలు కాకుండా ఉండే అవకాసం ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకూ ఈ పోగ్రాం లో భాగంగా అనంతపూర్, ఖమ్మం, అదిలాబాద్, కర్నూలు, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాలు పర్యటించి కార్యక్రమం నిర్వహించారు.

About Udaya Bhanu's Niggadeesi Adugu Show


ఇక గత కొంత కాలంగా రాజకీయాల్లోకి వస్తుందంటూ ప్రచారం సాగుతున్న టీవీ యాంకర్, నటి ఉదయభాను ఈ పోగ్రామ్ తో కంక్లూజన్ కి వచ్చినట్లే అంటున్నారు. మారిన రాష్ట్ర పరిస్థితులు, తెలంగాణ ఏర్పాటు వంటి కారణాలతో ప్రస్తుతం రాజకీయ రంగమంతా గందరగోళంగా మారింది. ఈ సమయాన్నే తన రాజకీయ రంగ ప్రవేశానికి వేదిక చేసుకోవాలని భాను నిర్ణయించుకుందని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తేలింది.

అయితే గతంలో పలు విషయాల్లో మీడియాకెక్కిన భాను ఒక దశలో అవసరమైన సమయంలో రాజకీయ రంగంలోకి వస్తానని ఇదివరకే చెప్పింది. దీంతో ప్రస్తుతం వివిధ పార్టీలు ఆమెను తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నాయట. అయితే ఈ విషయంలో మాత్రం ఆమె ఆచితూచి అడుగేయాలని నిర్ణయించుకుందట.

English summary
Udaya Bhanu is getting ready to throw political fireball with her awareness show on elections titled Niggadeesi Adugu for a TV channel. The aim of the show is to raise awareness among people before they cast their votes. The actress is on a tour of all the districts of Andhra Pradesh and is compiling problems that are faced by people.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu