»   » చలపతిరావు వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే.. యాంకర్ రవి నాతో చెడుగా.. శ్రీముఖి

చలపతిరావు వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే.. యాంకర్ రవి నాతో చెడుగా.. శ్రీముఖి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆడవాళ్లు పక్కలోకి పనికి వస్తారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చలపతిరావు బహిరంగ క్షమాపణలు చెప్పిన ఆ వ్యవహారం తీవ్రత తగ్గుముఖం పట్టలేదు. చలపతిరావుపై ఇంకా నిరసన సెగలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి యాంకర్ రవి వీడియో మెసేజ్ ద్వారా వివరణ ఇచ్చారు. చలపతిరావు ఏమి మాట్లాడారో నాకు అర్థం కాలేదు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఏర్పడింది అని చెప్పారు. అంతేకాకుండా పటాస్ జోడి శ్రీముఖితో తన ప్రవర్తన గురించి, టెక్నికల్ ప్రాబ్లం గురించి రవి వివరణ ఇప్పించడం గమనార్హం. ఈ వివాదం గురించి శ్రీముఖి ఏమన్నారంటే..

రవికి మద్దతు ఇవ్వలేను..

రవికి మద్దతు ఇవ్వలేను..

ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలు లైవ్‌గా జరుగుతుంటాయి. స్టేజీ మీద నుంచి మాట్లాడేటప్పుడు ఇతరులు ఏమి మాట్లాడుతున్నారో వినిపించదు. మైక్, సౌండ్ పరంగా టెక్నికల్ ప్రాబ్లం ఉంటాయి. టెక్నికల్ ప్రాబ్లం వల్ల రవి ఇబ్బంది పడవచ్చు. ఇలాంటి ఇబ్బందులను నేను కూడా ఫేస్ చేశాను. రవికి చలపతిరావు మాటలు వినపడిందా లేదా అనే విషయంపై రవికి సపోర్ట్ ఇవ్వలేను అని యాంకర్ శ్రీముఖి అన్నారు.

రవి నాతో చెడుగా..

రవి నాతో చెడుగా..

యాంకర్ రవితో నేను పటాస్‌తోపాటు చాలా కార్యక్రమాలు చేశాను. రవి నాతో ఎప్పుడు చెడుగా మాట్లాడటం, బిహేవ్ చేయలేదు. ఒకవేళ అలాంటి సమస్యలు ఉంటే రవితో కలిసి షో చేయడం మానేసే దానిని. రవి నాతో దురుసుగా ప్రవర్తించారని వెబ్‌సైట్లో వచ్చిన వార్తలకు సమాధానం ఇవ్వను. ఒకవేళ నాకు కంఫర్ట్ లేకపోతే రవితో షో చేయను. ఆయనపై ఎప్పుడో షో నిర్వాహకులు ఫిర్యాదు చేసేదానిని. న్యూస్ ఛానెల్‌కు వచ్చి కంప్లయింట్ చేసేదానిని. రవితో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని శ్రీముఖి చెప్పారు.

చలపతిరావు మాటలు తప్పు..

చలపతిరావు మాటలు తప్పు..

సినీయర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పు. ఆయన మాటలను జీర్జించుకోలేకపోతున్నాను. చలపతిరావు సారీ చెప్పాలి మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాను అని శ్రీముఖి పేర్కొన్నారు. రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఆవిష్కరణలో ఆడవాళ్లు పక్కలోకి పనికి వస్తారు అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కొందరు స్వంత ప్రయోజనాలకు..

కొందరు స్వంత ప్రయోజనాలకు..

శ్రీముఖి మీడియాతో మాట్లాడిన తర్వాత రవి స్పందిస్తూ.. నాకు ఈ వ్యవహారంలో మద్దతు కోసం శ్రీముఖితో మాట్లాడించలేదు. కేవలం టెక్నికల్ ప్రాబ్లెం వల్ల జరిగిందని చెప్పడానికి శ్రీముఖితో చెప్పించాను. అంతేగాని మరొకటి లేదు. చలపతిరావు వివాదాన్ని కొందరు సొంత ప్రయోజనాలకు వాడుకొంటున్నారు. అలాంటి ప్రయత్నాలను మానుకోవాలి అని యాంకర్ రవి సూచించడం గమనార్హం.

English summary
Anchor Srimukhi responded over actor Chalapatirao derogatery comment on Women. She said There will be a technincal problem while conducting the live programme. That may be cause for Ravi reaction over Chalapatirao statement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu