For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొంప ముంచిన పోలికలు: జబర్ధస్త్ కమెడియన్‌ చేసిన పనికి ఇబ్బందులు పడుతోన్న సినీ నటుడు

  By Manoj Kumar P
  |

  ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అన్న నానుడి గురించి తెలియని వాళ్లు ఉండరేమో. నిజానికి ఒక మనిషిని పోలిన వాళ్లు ఉన్నా తెలిసే పరిస్థితులు లేవు. అయితే, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ఒకే పోలికలు ఉన్న వాళ్లు తారస పడుతున్నారు. ఇక, సెలెబ్రిటీల డూపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమను తాము పలానా సెలెబ్రిటీలా ఉన్నామని సంబర పడేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడా పోలికలే ఓ సినీ నటుడికి కష్టాలను తెచ్చి పెట్టాయి. ఆ సంగతులేంటో చూద్దాం.!

  రెడ్ హ్యాండె‌డ్‌గా దొరికిన కమెడియన్స్

  రెడ్ హ్యాండె‌డ్‌గా దొరికిన కమెడియన్స్

  రెండు రోజుల క్రితం వ్యభిచార గృహాంపై జరిగిన పోలీసుల దాడుల్లో జబర్ధస్త్ కమెడియన్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. చాలా కాలంగా జబర్ధస్త్‌ షోలో పని చేస్తున్న ఇద్దరు యంగ్ కమెడియన్లు దొరబాబు, పరదేశీ విశాఖపట్నంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కారు. దీంతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది.

  ఇద్దరూ అతడి టీమ్‌కు చెందిన వాళ్లే

  ఇద్దరూ అతడి టీమ్‌కు చెందిన వాళ్లే

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎంతో పాపులర్ అయిన షోలలో జబర్ధస్త్ ఒకటి. ఈ షో ద్వారానే ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా వచ్చిన వాళ్లలో దొరబాబు, పరదేశీ కూడా ఉన్నారు. వీళ్లిద్దరూ హైపర్ ఆది టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. దొరబాబు ఎప్పటి నుంచో ఈ షోలో కనిపిస్తుండగా.. పరదేశీ మాత్రం ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్నాడు.

  కామెడీ పంచులే ఇప్పుడు నిజమయ్యాయి

  కామెడీ పంచులే ఇప్పుడు నిజమయ్యాయి

  దొరబాబు గతంలో ఓ శృంగారభరిత సినిమాలో నటించాడు. అది యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయింది. అందుకే హైపర్ ఆది తన స్కిట్లలో దీన్ని తరచూ ప్రస్తావిస్తూ ఉంటాడు. అలాగే, దొరబాబుపై ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగులు వదులుతూ ఉంటాడు. ఇవన్నీ స్కిట్‌లో భాగమే అనుకుంటే.. ఇప్పుడు వాటిని నిజం చేశాడు సదరు కమెడియన్.

  సినీ నటుడి కొంప ముంచిన పోలికలు

  సినీ నటుడి కొంప ముంచిన పోలికలు

  జబర్ధస్త్ కమెడియన్లు వ్యభిచారం చేస్తూ పట్టుబడడంతో చాలా మంది షాక్‌కు గురయ్యారు. అయితే, ఓ సినీ నటుడు మాత్రం ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నాడు. అతడే.. దావూద్. ‘భీష్మ' సహా కొన్ని హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. అచ్చం దొరబాబులానే ఉంటాడు. దీంతో వ్యభిచారం చేసింది అతడే అని చాలా మంది పొరపాటు పడుతున్నారట.

  Anchor Anasuya Bharadwaj Strong Warning || మర్యాదగా కామెంట్స్ డిలీట్ చెయ్యండి..! | Filmibeat Telugu
  కష్టాలు చెప్పుకుని బాధ పడుతున్నాడు

  కష్టాలు చెప్పుకుని బాధ పడుతున్నాడు

  దొరబాబు అనుకుని తనపై వస్తున్న పుకార్లను ఖండించేందుకు అతడు ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడాడు. ‘పోలీసులకు దొరికింది నేను కాదు.. ఇది తెలియక చాలా మంది నాకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. నేను సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న దావూద్‌ను. మేమిద్దరం కలిసి గతంలో ఓ స్కిట్ చేశాం. ఆ తర్వాత అతడిని ఎప్పుడూ కలవలేదు' అని చెప్పుకొచ్చాడు.

  హైపర్ ఆది చేసిన పని వల్లే కలిశారు

  హైపర్ ఆది చేసిన పని వల్లే కలిశారు

  గతంలో హైపర్ ఆది కవలల నేపథ్యంతో ఓ స్కిట్ చేశాడు. అందులో తనతో పాటు దొరబాబు పోలికలు ఉన్న ఇద్దరిని తీసుకొచ్చాడు. అప్పుడే దావూద్ తెలుగు వారందరికీ పరిచయం అయ్యాడు. ఆ స్కిట్ బాగా పేలడంతో ఆయనకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత దావూద్‌కు కొన్ని సినిమాల్లో అవకాశాలు కూడా లభించడం విశేషం.

  English summary
  Tollywood actor Dawood reacted on Jabardasth comedian Dorababu's caught in prostitution sting in Visakhapatnam. Addressing the media, Dawood said that he is receiving a lot of calls from his well-wishers as he looks similar like Jabardasth comedian Dorababu and he asserted that he is not one who caught on police raids in Visakhapatnam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X