twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 త్వరలోనే ప్రారంభం.. సరికొత్త ఫార్మాట్‌తో ఓటీటీ సీజన్ 1 ఎప్పుడంటే.. నాగార్జున బంపర్ న్యూస్

    |

    బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ దిగ్విజయంగా ముగిసింది. దాదాపు 15 వారాలపాటు 19 మంది కంటెస్టెంట్లు తమదైన శైలిలో ఇంటిలో రాణించడమే కాకుండా తమ ప్రతిభను పలు కోణాల్లో చాటుకొన్నారు. ఉత్కంఠగా మారిన గ్రాండ్ ఫినాలేలో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. అయితే ఊహించని విధంగా బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్ ‌ త్వరలోనే ప్రారంభించనున్నాను. బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలేలో సీజన్ 6 గురించి హోస్ట్ నాగార్జున క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 ఎప్పుడు ప్రారంభం కాబోతున్నదంటే..

    హిందీలో ఓటీటీ మాదిరిగానే..

    హిందీలో ఓటీటీ మాదిరిగానే..

    గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్‌బాస్ రియాలిటీ షో సరికొత్త పరిణామం చోటుచేసుకొన్నది. ఏడాదికి ఒక మారు నిర్వహించే ఈ షోలో మార్పులు చేసి ముందుగా మూడు నెలలు అదనంగా జోడించారు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ షోకు ముందస్తుగానే పలువురు కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ ఓటీటీని ప్రారంభించారు. ఈ షోకు కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరించారు. 42 రోజులపాటు ఈ షోను నిర్వహించారు. అందులో టాప్ 3గా నిలిచిన వారిని మెయిన్ బిగ్‌బాస్ షోలోకి తీసుకొన్నారు.

    బిగ్‌బాస్ ఓటీటీలో టాప్ కంటెస్టెంట్లు

    బిగ్‌బాస్ ఓటీటీలో టాప్ కంటెస్టెంట్లు

    వూట్ ఓటీటీ ఛానెల్‌లో హిందీలో నిర్వహించిన బిగ్‌బాస్ ఓటీటీ ఫార్మాట్‌లో మొత్తం 5 గురు టాప్ కంటెస్టెంట్లుగా నిలిచారు. వారిలో షమితా శెట్టి, ప్రతీక్ సెహజ్‌పాల్, దివ్య అగర్వాల్, రాకేష్ బాపట్, నిషాంత్ భట్ ఉన్నారు. వీరిని సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే షోలోకి వీరిని తీసుకొన్నారు. ఇలాంటి ఫార్మాట్‌ను త్వరలోనే తెలుగులో కూడా అమలు చేయబోతున్నారు.

    మరో రెండు నెలల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్

    మరో రెండు నెలల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్

    బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. నా పంచప్రాణాలైన అభిమానులకు ఓ న్యూస్ చెప్పాలి. సాధారణంగా ఒక ఫినాలే ముగిసిన 9 నెలల తర్వాత మరో సీజన్ మొదలు అవుతుంది. కానీ ఈ సారి మాత్రం కొత్త సంవత్సరం మొదలైన వెంటనే రెండు నెలల్లో కొత్త సీజన్ అంటే బిగ్‌బాస్ తెలుగు 6 ప్రారంభమవుతుంది. త్వరలోనే మిమ్మల్ని కలుసుకొంటాను అని నాగార్జున చెప్పారు.

    ఫిబ్రవరిలోనే బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ

    ఫిబ్రవరిలోనే బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ

    అయితే బిగ్‌బాస్ తెలుగు 6 ప్రారంభానికి ముందు ఓటీటీ సీజన్ ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాదాపు రెండు నెలలపాటు ఈ స్పెషల్ షో కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ షోలోకి పంపాల్సిన కంటెస్టెంట్ల గురించి నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే వివరాలను పూర్తిగా, అధికారికంగా వెల్లడించనున్నారు.

    ఔత్సాహికుల్లో, ప్రేక్షకుల్లో ఉత్సాహం

    ఔత్సాహికుల్లో, ప్రేక్షకుల్లో ఉత్సాహం

    బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్నదని హోస్ట్ నాగార్జున చెప్పగానే ఈ రియాలిటీ షోలో పాల్గొనాలనే ఔత్సాహికులు ఉత్సాహంతో ఉన్నారు. అలాగే బిగ్‌బాస్ అభిమానుల్లో కూడా ఈ వార్త ఆసక్తిని పెంచింది. అయితే బిగ్‌బాస్ షోను ఆదరించినట్టే ఓటీటీ షోను ఆదరిస్తారా? 24 గంటలపాటు ఈ షోను ప్రసారం చేస్తారా అనే విషయం గురించి వేచి చూడాల్సిందే.

    English summary
    Bigg Boss Telugu 5 season has been completed on December 18th. Actor Nagarjuna Akkineni reveals about Bigg Boss Telugu 6, Bigg Boss Telugu OTT Season 1.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X