Don't Miss!
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
బిగ్‌బాస్‌లో నందు వాయిస్.. సంతోషంగా ఉందంటూ పోస్ట్!
నటుడు, హీరో నందు ఆ మధ్య BB అంటూ ఎంత హంగామా చేశాడో అందరికీ తెలిసిందే. ఇక బీబీ అంటే అందరూ బిగ్ బాస్ అని పొరబడ్డారు. ఎన్నో ట్విస్ట్‌ల తరువాత బీబీ అంటే తన తదుపరి చిత్రం టైటిల్ అని.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఇక బీబీ అంటూ బిగ్ బాస్ అని ప్రచారం కావడంతో ఆ ప్రాజెక్ట్‌పై భారీగానే హైప్ క్రియేట్ అయింది. అయితే తాజాగా బీబీలో నందు వాయిస్ వినిపించింది.
నిన్నటి ఎపిసోడ్‌లో జబర్దస్త్ అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అవినాష్ ఎంట్రీతో పాటు అతని లైఫ్ జర్నీకి సంబంధించిన ప్రోమోను ప్లే చేశారు. అందులో అవినాష్ చిన్నతనం నుంచి పడిన కష్టాలను పూసగుచ్చినట్టు వివరించారు. అంక మధ్యమం, అంక గణితం, అవమానాలు, కష్టాలు, నష్టాలు, ప్రేమ, జోకర్ అంటూ తన జీవిత గురించి చెబుతూ ఓ వాయిస్ వినబడింది. అని నందు వాయిస్. ఈ మేరకు నందు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

నేను చాలా ఇష్టపడే డైరెక్టర్.. నా ఫ్రెండ్ అవినాష్ కోసం వాయిస్ ఓవర్ చెప్పాను.. బీబీ బీబీ అని చెప్పినందుకు చివరగా ఇలానైనా నా వాయిస్‌తో మీకు ఈ బీబీలో వినపడినందుకు సంతోషం అంటూ నందు పోస్ట్ చేశాడు. మొత్తానికి ఇలా బీబీతో నందు చేసిన రచ్చకు న్యాయ జరిగింది. ఇక బిగ్‌బాస్ షోలో అవినాష్ ఎంట్రీ ఓ రేంజ్‌లో ఉండగా.. ఇంట్లోకి వచ్చాక కూడా అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి అవినాష్ ప్రయాణం ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి.