»   » రామోజీ-సుమన్ ల మధ్య విభేదాల కారణాన్ని బయటపెట్టిన ప్రభాకర్ :అసలారోజు ఏం జరిగింది..!?

రామోజీ-సుమన్ ల మధ్య విభేదాల కారణాన్ని బయటపెట్టిన ప్రభాకర్ :అసలారోజు ఏం జరిగింది..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రైవేటు చానెళ్ళ రంగం మొదలైన తొలినాళ్ళలో ఈ టీవీ ప్రభంజనం అంతా ఇంతా కాదు. టీవీసీరియళ్ళను ఒక రకంగా తెలుగు వాళ్ళకి ఎక్కువగా అలవాటు చేసింది ఈటీవీనే. చానెల్ వ్య్వహారాల్లో ఎక్కువ భాగం ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కుమారుడు సుమన్ చూసుకునే వారు...

కొన్నేళ్ళు బాగానే సాగినా తర్వాత తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి సడెంగా ఒక రోజు సుమన్ ఈటీవి కి రాజీనామా ఇచ్చేసి తండ్రి పైనే యుద్దం ప్రకటించారు ఇంటినుంచే వెళ్ళిపోయి హొటల్ లో ఉన్నారు... తర్వాత పరిస్థితులు చక్క బడ్డాక మళ్ళీ తండ్రీ కొడుకులు కలిసిపోయారు... దురదృష్టవశాత్తూ సుమన్ క్యాన్సర్ భారిన పడ్డారు తుది శ్వాస విదిచే వరకూ తండ్రి దగ్గరే ఉన్నారు....

అయితే ఆ నాటి గొడవ విశయం ఇప్పుడు బయటికి వచ్చింది ఇద్దరి మధ్యా ఉన్న బేదాభిప్రాయాలను దగ్గరినుంచీ చూసిన సుమన్ స్నేహితుడూ, బుల్లితెర నటుడూ ప్రభాకర్ తాజాగా ఆనాటి విశయాలను బయట పెట్టాడు...

Actor prabhakar revealed the secrets about suman and ramoji

ఇప్పటి వరకు ఆ గొడవ ఎందుకు వచ్చిందో కచ్చితంగా ఎవరూ చెప్పలేదు. కానీ నటుడు ప్రభాకర్ నే ఆ వివాదం సంగతి బయటకు చెప్పాడు. అపాటికే కొన్ని తేడాల వల్ల రామోజీ సుమన్ లు కాస్త దూరంగానే ఉంటున్న రోజుల్లో.. ఉదయం పూట స్లాట్లను రామోజీ తనయుడు సుమన్ చూస్తుండగా..మధ్యాహ్నం తర్వాత ఏముండాలనే విషయాన్ని తండ్రి రామోజీరావు చూశారట.

ఒకరే కాకుండా ఇద్దరు నిర్వహించటం తో ప్రోగ్రాం స్లాట్లలో మార్పులు జరిగాయి. అయితే అప్పుడు సుమన్ తరఫున చానల్ వ్యవహారాలు చూస్తున్న నటుడు, సుమన్ స్నేహితుడు ప్రభాకర్ కు ఈ మార్పులు చికాకు తెప్పించి విషయం సుమన్ కు చెప్పాడట. "సరే నీకు ఎలా కావాలంటే అలా మార్చుకో" అని సుమన్ చెప్పటం తో తానూ కొన్ని మార్పులు చేసాడట.

అయితే తాను డిజైన్ చేసిన స్లాట్ల లో తేడాలు రావటం తో రామోజీరావుకు కోపం కట్టలు తెచ్చుకుంది. అందుకే ప్రభాకర్ ను పిలిచి మరీ ఏం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారట.అంతే కాదు రాజీనామా చేసేసి వెళ్ళిపో అని అన్యాపదేశంగా సూచించటం తో ప్రభాకర్ రిజైన్ చేసేసాడు...

Actor prabhakar revealed the secrets about suman and ramoji

ఈ సంగతి తెలుసి సుమన్ తన స్నేహితునికి జరిగిన అవమానాన్ని భరించలేకా, తన సూచనలు పాటించినందుకే ఇలా చేసారన్న కోపం తో తానూ ఈటీవీ ఎండీ పదవికి రాజీనామా చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చి ఓ హోటల్ లో ఉన్నారు. మానాన్న ఒక చెడ్డ తండ్రి అంటూ అప్పట్లో ప్రభాకర్ తో కలిసి ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా.. ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయి. తాను అనారోగ్యంతో చనిపోయేంత వరకు తండ్రి వద్దనే ఉన్నారు. కానీ ఆ రోజు సుమన్ ను రాజీనామా చేయవద్దని ప్రభాకర్ బతిమిలాడినా సుమన్ వినలేదట.

కానీ ఆ గొడవతో ప్రభాకర్ కెరీర్ కే పెద్ద దెబ్బపడింది.. ఆ ప్రభావం ప్రభాకర్ ని చాలా కాలమే వెంటాడింది. అతి కష్టం మీద నిలదొక్కుకో గలిగి తన కెరీర్ని నిలబెట్టుకోగలిగాడు కానీ అప్పటికే కెరీర్ పరంగా,ఆర్థికంగా చాలా కష్టాలనే ఎదుర్కున్నాడు ప్రభాకర్. ఉద్యోగులు ఎవరైనా ఈటీవీ స్లాట్స్ తొలగించారని అనుకుని తాను మార్చాననీ. అదే రామోజీరావు మార్చారని తెలిస్తే తాను అసలు కదిలించే వాడినే కాదనీ.. కానీ అప్పుదు అలా జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు.

English summary
"Why they hate each other...!?" actor prabhakar revealed the secrets about clashes between eenaadu ramoji rao and his son younger son suman
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu