For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీముఖిపై హిమజ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆ కంటెస్టెంట్ల రిలేషన్‌పైనా షాకింగ్ కామెంట్స్.!

  By Manoj
  |

  తెలుగు బుల్లితెరపై ప్రసారమైన వివాదాస్పద కార్యక్రమాల్లో బిగ్ బాస్ ఒకటన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్‌లో పెద్దగా గొడవలు జరగకపోయినప్పటికీ.. తర్వాత జరిగిన రెండు సీజన్లలో మాత్రం ఇంటా బయట వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆ గొడవలన్నీ బిగ్ బాస్ హౌస్ వరకే ఉంటాయని, బయట మామూలుగానే ఉంటామని చాలా మంది కంటెస్టెంట్లు చెబుతుంటారు. అయితే, అవన్నీ వట్టి మాటలే అని బిగ్ బాస్ సీజన్ - 3 కంటెస్టెంట్ హిమజ చెప్పుకొచ్చింది. అంతేకాదు, శ్రీముఖిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీకోసం.!

  స్వయంవరంతో ఫేమస్.. తర్వాత అలా ఎంట్రీ

  స్వయంవరంతో ఫేమస్.. తర్వాత అలా ఎంట్రీ

  ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడుపుతోంది నటి హిమజ. ‘స్వయంవరం' అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఆమె.. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఎన్నో సీరియళ్లలో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ వదులుకుని సినిమాల్లో నటిస్తోందీ గుంటూరు అమ్మాయి.

  రామ్ చరణ్.. మహేశ్.. ఇప్పుడు చిరంజీవి

  రామ్ చరణ్.. మహేశ్.. ఇప్పుడు చిరంజీవి

  ‘శివమ్' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది హిమజ. ఆ తర్వాత ‘నేను శైలజ', ‘చుట్టాలబ్బాయి', ‘ధృవ', ‘మహానుభావుడు', ‘శతమానంభవతి', ‘స్పైడర్', ‘ఉన్నది ఒకటే జిందగీ', ‘నెక్ట్స్ నువ్వే', ‘వినయ విధేయ రామ', ‘చిత్రలహరి' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య'లోనూ అవకాశం దక్కించుకుంది.

  ఆ ఇంట్లోకి ఎంట్రీ... గొడవలతో హాట్ టాపిక్

  ఆ ఇంట్లోకి ఎంట్రీ... గొడవలతో హాట్ టాపిక్

  ఒకవైపు సీరియళ్లు.. మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న హిమజ.. గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ - 3లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ సీజన్‌లో అమాయకపు అమ్మాయిగా పరిచయమైన ఆమె.. చాలా గొడవల్లో భాగమైంది. అలాగే, అలీ కాళ్లు పట్టుకోవడం హైలైట్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆమె హాట్ టాపిక్ అయింది.

  శ్రీముఖి డైరెక్షన్‌లోనే బిగ్ బాస్ నడుస్తోంది

  శ్రీముఖి డైరెక్షన్‌లోనే బిగ్ బాస్ నడుస్తోంది

  బిగ్ బాస్ హౌస్ నుంచి సీజన్ మధ్యలోనే బయటకు వచ్చేసింది హిమజ. ఉన్నది ఉన్నట్లు చెప్పే అమ్మాయిగా ఆమెకు పేరు వచ్చింది. ఈ క్రమంలోనే ఎలిమినేట్ అయిన తర్వాత జరిగిన పలు ఇంటర్వ్యూల్లో శ్రీముఖిపై హిమజ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు, ఆమె డైరెక్షన్‌లోనే బిగ్ బాస్ షో నడుస్తుందని బాంబ్ పేల్చింది. దీంతో ఈ లేడీ యాక్టర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

  మీకు లోపల జరిగింది ఏమీ తెలియదు

  మీకు లోపల జరిగింది ఏమీ తెలియదు

  లాక్‌డౌన్ నేపథ్యంలో హిమజ తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా శ్రీముఖి అభిమానులపై మరోసారి ఫైర్ అయింది. ‘అప్పుడు నేను శ్రీముఖి గురించి మాట్లాడడానికి ఆమె ఫ్యాన్సే కారణం. నాకు పిచ్చి పిచ్చి మెసేజ్‌లు పెట్టి రెచ్చగొట్టారు. అసలు లోపల ఏం జరిగిందో వాళ్లకు తెలుసా.? తెలిస్తే అలా మాట్లాడరు' అంటూ చెప్పుకొచ్చింది.

  శ్రీముఖిపై హిమజ వివాదాస్పద వ్యాఖ్యలు

  శ్రీముఖిపై హిమజ వివాదాస్పద వ్యాఖ్యలు

  ఇక, శ్రీముఖి గురించి ప్రస్తావిస్తూ.. ‘నేను బయటకు వచ్చిన తర్వాతనే శ్రీముఖి గురించి తెలుసుకున్నా. లోపల నాతో ఫ్రెండీగా ఉంటూనే నా వెనుక కుట్రలు చేసింది. ఆమె బయటకు కనిపించేంత జెన్యూన్ పర్సన్ కాదని అప్పుడే నాకు అర్థమైంది. పాత ఎపిసోడ్స్ చూసిన తర్వాతనే నేను శ్రీముఖి గురించి ఇంటర్వ్యూల్లో వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది' అని వివరించిందామె.

  Bigg Boss Telugu Management Gives Clarity Over Host & Show Details
  ఆ సెలెబ్రిటీల రిలేషన్‌పై షాకింగ్ కామెంట్స్.!

  ఆ సెలెబ్రిటీల రిలేషన్‌పై షాకింగ్ కామెంట్స్.!

  బిగ్ బాస్‌ కంటెస్టెంట్ల మధ్య రిలేషన్ గురించి స్పందిస్తూ.. ‘బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత ఎవరూ నాతో కలవలేదు. లోపల ఒకలా బయట ఒకలా ఉంటున్నారు. అందుకే నేను ఎవరితోనూ కలిసినట్లు ఫొటోలు ఉండవు. కానీ, శివ జ్యోతి మాత్రం నాకు చాలా ఫ్రెండ్ అయింది. నా కంటే వయసులో చిన్నదే అయినా చాలా పెద్దదానిలా వ్యవరిస్తోంది' అంటూ వెల్లడించింది హిమజ.

  English summary
  Himaja is an Indian film actor who works primarily in Telugu cinema. She is noted actress by acting in movies like Nenu Sailaja, Unnadi Okate Jindagi, Mahanubhavudu, Shatamanam Bhavathi, Next Nuvve, Vinaya Videya Rama, Dhruva and Chitra Lahari.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X