»   » శివగామిగా మధుబాల.. స్టార్‌ప్లస్‌లో ఆరంభ సీరియల్..

శివగామిగా మధుబాల.. స్టార్‌ప్లస్‌లో ఆరంభ సీరియల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినిమా పరిశ్రమలో బాహుబలి చిత్రం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. బాహుబలి చిత్ర కథ స్ఫూర్తిగా ఆరంభ్ అనే పేరుతో టెలివిజన్ ‌సీరియల్‌గా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ శివగామి పాత్రను రమ్యకృష్ణ పోషించిన సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. అదే పాత్రను టెలివిజన్ సీరియల్‌లో ప్రముఖ నటి మధుబాల పోషిస్తున్నారు. రమ్యకృష్ణ, మధుబాల ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ అల్లరిప్రియుడు అనే చిత్రంలో అక్కాచెల్లెల్లుగా నటించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్ హీరో అన్న సంగతి తెలిసిందే.

Actress Madhubala as Sivagami in Arambh serial

రోజా, జెంటిల్‌మేన్‌, అల్ల‌రి ప్రియుడు చిత్రాల‌తో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను సీనియ‌ర్ న‌టి మ‌ధుబాల మెప్పించింది. వివాహం తర్వాత అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో త‌ల్లి పాత్ర‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. బాహుబ‌లితో ప్రాచుర్యం పొందిన శివ‌గామి పాత్ర‌లో మధుబాల క‌నిపించేందుకు సిద్ధమవుతున్నది. ఈ సీరియల్ స్టార్‌ప్లస్‌లో ప్రసారం కానున్నది.

Actress Madhubala as Sivagami in Arambh serial

బాహుబలి కథా రచయిత విజయేంద్ర‌వర్మ ఈ సీరియ‌ల్‌కు క‌థ‌ను అందిస్తున్నారు. సీరియ‌ల్‌లో దేవ‌సేన పాత్ర‌ను కార్తీక పోషిస్తుంది. ప్రముఖ దర్శకుడు గోల్డీ బెహ‌ల్ ద‌ర్శ‌కత్వంలో సీరియ‌ల్ రూపొంద‌నున్నది. ద్రావిడులు, ఆర్యుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఓ సంఘ‌ర్ష‌ణ‌ను ఈ సీరియ‌ల్‌లో ప్ర‌ధానాంశంగా చూపించ‌బోతున్నారు.

English summary
writer Vijayendra Prasad carved out the TV series "Aarambh" now. Reports have that Madhubala has now come on board to play the role of Sivagami inspired character, though the character's name will somewhat change.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu