For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యంగ్ డైరెక్టర్‌తో బిగ్‌బాస్ బ్యూటీ పెళ్లి.. రెండో పెళ్లికి సిద్ధమవుతున్న హీరోయిన్

By Manoj
|

ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాదిలో భారీ సక్సెస్‌ను దక్కించుకున్న రియాలిటీ షో 'బిగ్ బాస్'. అందుకే ఇక్కడి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఈ షో ప్రసారం అవుతోంది. బిగ్ బాస్ చరిత్రలో తమిళంలో మాత్రమే ఈ షో వివాదాస్పదం అయింది. ఈ షోను తమిళనాడు వాళ్లు స్వాగతించలేదు. ఇందులో కంటెంట్‌ వాళ్లకు నచ్చకపోవడమే దీనికి కారణం. ఇలాంటి షోలో అవకాశం దక్కించుకుని హాట్ టాపిక్ అయింది రేష్మా పసుపులేటి. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి.. తమిళ బిగ్ బాస్‌లో ఎంతో ప్రభావం చూపించింది. అయితే, విజేతగా మాత్రం నిలవలేకపోయింది. తాజాగా ఈ అమ్మడి పెళ్లి గురించి ఆశ్చర్యకర వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చేసింది. ఇంతకీ ఎంటా కథ..?

తెలుగులో కూడా చేసింది

తెలుగులో కూడా చేసింది

రేష్మా పసుపులేటి.. తెలుగులోనూ పలు టీవీ ఛానెళ్లలో పని చేసింది. కొన్ని సీరియల్స్ నటించింది. అయితే, ఆమెకు అంతగా పేరు రాలేదు. అదే సమయంలో కొన్ని ప్రొగ్రామ్‌లకు యాంకరింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించింది. అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ఆమె తెలుగు వాళ్లకు బైబై చెప్పేసింది.

తమిళంలో మాత్రం బాగా ఫేమస్

తమిళంలో మాత్రం బాగా ఫేమస్

తెలుగులో కావాల్సిన బ్రేక్ రాకపోవడంతో.. రేష్మా తమిళ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. అక్కడ కో 2, మసాలా పాదం, తిరక్కు వరదా కతై తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు, ఎన్నో సీరియల్స్‌లో అద్భుతమైన నటనను కనబరిచి బాగా ఫేమస్ అయింది. ఇప్పటికీ ఆమె పలు సీరియల్స్‌లో కనిపిస్తూనే ఉంది.

ఊహించని రీతిలో అవకాశం దక్కింది

ఊహించని రీతిలో అవకాశం దక్కింది

తమిళంలో సినిమాలు, సీరియల్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్న రేష్మాకు ‘బిగ్ బాస్' నిర్వహకుల నుంచి ఆహ్వానం అందింది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల వచ్చిన సీజన్ - 3కి ఎంపికైంది. ఈ షో ద్వారా రెష్మా మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో ఆమె వ్యవహరించిన తీరుకు తమిళ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఇద్దరికి విడాకులు ఇచ్చేసింది

బిగ్ బాస్ షో జరుగుతున్న సమయంలో ఓ టాస్క్‌లో భాగంగా రెష్మా తన వైవాహిక జీవితం గురించి వెల్లడించింది. దీని ప్రకారం.. ఆమె మొదట పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. అది వర్కౌట్ కాక విడాకులు తీసుకుంది. తర్వాత అమెరికాలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తర్వాత అతడికీ విడాకులు ఇచ్చేసింది.

మళ్లీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసింది

ఇటీవల రెష్మా.. డైరెక్టర్ నిషాంత్ రవీంద్రన్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆమె తాజాగా స్పందించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ‘నా వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. దయచేసి అసత్య ప్రచారం చేయకండి' అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

#CineBox : Nani's New Film Titled Tuck Jagadish
తెలుగు ప్రొడ్యూసర్ కూతురు

తెలుగు ప్రొడ్యూసర్ కూతురు

రేష్మా పసుపులేటి ప్రముఖ తెలుగు సినీ నిర్మాత ప్రసాద్ పసుపులేటి కూతురు. అంతేకాదు, తమిళంలో బెస్ట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న బాబీ సింహాకు కజిన్. ఈమె మొదట ఎయిర్ హోస్టెస్‌గా పని చేసింది. ఆ తర్వాత యాక్టింగ్‌పై మక్కువతో సినీ, టీవీ రంగంలోకి ప్రవేశించింది.

English summary
Reshma Pasupuleti was born into a Telugu-speaking family to Prasad Pasupuleti, a Telugu film producer. She has a sister Deepti and sushma who is a software engineer in the USA, while her cousin is Tamil actor Bobby Simha. Reshma pursued her education abroad, first in Arkansas, and then completed her engineering degree in the computer science department from the Texas A&M University.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more